Prema Volunteer trailer Out: బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ఇమ్మాన్యుయేల్. ఇతడు జబర్దస్త్ షో ద్వారా ఎంతో మందిని నవ్వించి లెక్కలేనంత మంది అభిమానులను సంపాదించుకున్నాడు. వర్షతో లవ్ ట్రాక్ నడిపి మరింత పాపులర్ అయ్యాడు. అంతేకాకుండా సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టి ఢిపరెంట్ వీడియోలను చేస్తూ..ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, అప్పుడు సినిమాల్లో నటిస్తూ నెమ్మదిగా తన కెరీర్ ను బిల్డ్ చేసుకుంటున్న ఇతడు సడన్ గా హీరో అవతారమెత్తాడు. ‘'ప్రేమ వాలంటీర్‌'’(Prema Volunteer) అనే వెబ్‌ సిరీస్‌తో ఆడియెన్స్ ముందుకు రానున్నాడు. ఇమ్మానుయేల్ తన ఫ్రెండ్స్ తోనే కలిసి ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ అయింది. ఇందులో ఇమ్మాన్యుయేల్‌ గ్రామ వాలంటీర్‌ పాత్ర పోషిస్తున్నాడు. వృద్ధులకు పెన్షన్లు పంచడం, అలాగే హీరోయిన్‌ను ప్రేమలో పడేసేందుకు హీరో ఎన్ని కష్టాలు పడ్డాడనేది ట్రైలర్ లో చూపించారు. ట్రైలర్ చూస్తుంటే తనదైన మార్క్ యాక్టింగ్ తో ఇమ్మానుయేల్ ఇరగదీసినట్లు తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ కు జబర్దస్త్ బాబునే రచన, దర్శకత్వం వహించడం విశేషం. ఇందులో ఇమ్మానుయేలుకు జోడిగా  విజయ విజ్జు నటించింది. ఇందులో గోపి, అనూష, దివాకర్, పుష్పమ్మ, జయరాం, రాజు తాత, మహేష్, మార్క్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. వెంకీ వీణ పాటలు, బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ అందించగా..హేమంత్ చిన్నోడ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. ఏపీలో వాలంటీర్ వ్యవస్థ హాట్ టాఫిక్ గా ఉంది. అలాంటి పాయింట్ తో సినిమా తీసి వీరు పెద్ద సాహసమే చేశారని చెప్పాలి. 



Also Read: Mrunal Thakur: ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైన మృణాల్ ఠాకూర్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook