Jabardasth: జబర్దస్త్ షో కి ఎండ్.. ఏడ్చేసిన రష్మీ, కంటెస్టెంట్స్, జడ్జెస్..
Extra Jabardasth: బుల్లితెర షోలలో ఎంతో పేరు తెచ్చుకున్న షో జబర్దస్త్. కాగా ఈ షో ముగియనుందట. ఇదే విషయాన్ని రష్మీ ఈమధ్య విడుదలైన ప్రోమోలో చెప్పింది. దీని గురించి పూర్తి వివరాలు మీకోసం..
Jabardasth Promo: బుల్లితెర షోలలో ఎంతో ప్రత్యేకమైన పేరు తెచ్చుకున్న షో జబర్దస్త్. బుల్లితెర పైన ఈ షో ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది. రష్మీ, అనసూయ లాంటి బ్యూటిఫుల్ యాంకర్స్ ని తెలుగు తెరకు పరిచయం చేసింది. ఈటీవీలో ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్న ఈ షో.. మంచి విజయం సాధించి.. దూసుకుపోతోంది. కాగా ఈ షో సాధించిన విజయంతో.. కొద్ది రోజుల తర్వాత ఎక్స్ట్రా జబర్దస్త్ షో ని కూడా ఈటీవీ వారు ప్రారంభించారు. ఈ ఎక్స్ట్రా జబర్దస్త్ కూడా ఎంతో పేరు తెచ్చుకుంది. ఈ షో ద్వారా తెలుగువారికి ఎంతోమంది కమెడియన్ కూడా పరిచయమయ్యారు.
అయితే మొదట్లో ఈ షో కి అనసూయ యాంకర్ గా ఉండగా ఆ తర్వాత ఆమె ప్లేస్ లో వేరే వాళ్ళు వచ్చారు. అంతేకాకుండా మొదట్లో నాగబాబు, రోజా జడ్జిలుగా ఉండగా.. ఆ తర్వాత వారిని కొంతమంది రీప్లేస్ చేస్తూ వచ్చారు. అయితే ఎవరు వచ్చినా.. వెళ్లిన ఈ షో మాత్రం ఆగలేదు. ఇటీవల జబర్దస్త్ లో జడ్జిగా ఉన్న ఇంద్రజ కూడా మానేస్తున్నాను అని చెప్పి ఎమోషనల్ అయిన ప్రోమో బాగా వైరల్ అయింది. ఇప్పుడు ఈ షో గురించి మరో షాకింగ్ వార్త వినిపిస్తోంది.
అసలు విషయానికి వస్తే ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోని పూర్తిగా తీస్తున్నట్టు తాజా ప్రోమోలో యాంకర్ రష్మి తెలిపింది. ప్రస్తుతం ఈటీవీలో గురువారం, శుక్రవారం.. జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ వస్తున్నాయి. కానీ ఇప్పుడు ఎక్స్‌ట్రా జబర్దస్త్ తీసేసి ఒకే పేరు జబర్దస్త్ తో శుక్ర, శని వారాలు రెండు ఎపిసోడ్స్ గా రానున్నట్టు రష్మీ ఈ ప్రోమోలో తెలిపింది. అయితే ఈ ఎక్స్ట్రా జబర్దస్త్ షో తీసేస్తుండటంతో యాంకర్ రష్మీ ఏడ్చేసింది. ఇక రష్మీతో పాటు అక్కడ ఉన్న పలువురు కంటెస్టెంట్స్, జడ్జిలు కూడా ఎమోషనల్ అయ్యారు.
ఇక ఈ విషయం తెలిసాక.. ఈ కారణంతోనే ఇంద్రజని కూడా జబర్దస్త్ నుంచి పంపించేసినట్టు తెలుస్తుంది. ఇకపై జబర్దస్త్ కి కృష్ణ భగవాన్, కుష్బూలు మాత్రమే రెండు రోజులు ప్రచారం అయ్యే షోలకు జడ్జీలుగా ఉంటారని తెలుస్తుంది. అలాగే యాంకర్ గా సిరి హనుమంత్ ని తప్పించి.. రెండు ఎపిసోడ్స్ కి రష్మీనే యాంకర్ ని చేస్తారని సమాచారం.
Also Read: AP Election Results: వైఎస్ జగన్‌కు భారీ మెజార్టీనా? పవన్ కల్యాణ్‌కా?.. కాయ్ రాజా కాయ్
Also Read: Diamonds Found: ఏపీలో వజ్రాల పంట పండుతోంది.. 3 రోజుల్లో కోట్ల విలువైన వజ్రాలు లభ్యం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter