Jabardasth Nookaraju asia love పటాస్ షోతో నూకరాజు తెరపైకి వచ్చాడు. పటాస్ షోతో యాంకర్ రవి, శ్రీముఖి, సద్దాం, నూకరాజు, ఫైమా వంటి వారెంతో మంది ఫేమస్ అయ్యారు. ఇక పటాస్ షోను ఆపేయడంతో చాలా మంది జబర్దస్త్ షోకి వచ్చారు. కొంత మంది ఇతర చానెళ్లకు వెళ్లారు. నూకరాజు మాత్రం ముందు నుంచి మల్లెమాలతోనే ఉన్నాడు. ఇప్పుడు జబర్దస్త్ షోలో టీం లీడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆది వెళ్లిపోవడంతో ఇప్పుడు కొత్త టీంలను ఏర్పాటు చేయాల్సి వచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పుడు జబర్దస్త్ షోలో నూకరాజు టీం లీడర్‌గా అదరగొట్టేస్తున్నాడు. తన ప్రేయసి ఆసియాతో కలిసి స్కిట్లు చేస్తున్నాడు. ఈ ఇద్దరి లవ్ ట్రాక్ ఇప్పుడు జబర్దస్త్ స్టేజ్ మీద బాగానే నడుస్తోంది. ఇన్ని రోజులు సోషల్ మీడియాలోనే ఈ ఇద్దరూ కలిసి సందడి చేసేవారు. కానీ ఇప్పుడు స్కిట్లతోనూ ఆకట్టుకుంటున్నారు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో నూకరాజు, ఆసియాలకు ఎదురుదెబ్బ తగిలినట్టు అయింది.


 



నూకరాజు ఎన్నో సందర్భాల్లో ఆసియా మీదున్న ప్రేమను వ్యక్తం చేశాడు. తను ఓకే అంటే ఇప్పుడే ఇక్కడే పెళ్లి చేసుకుంటాను.. ఇంట్లో వాళ్ల పర్మిషన్ కూడా అడగను అని నూకరాజు అన్నాడు. అయితే తాజాగా ఈ ఇద్దరికి అనుకోని షాక్ తగిలినట్టుంది. నూకరాజు, ఆసియాలు తమ తమ పేరెంట్స్‌ని తీసుకొచ్చి స్కిట్లు చేశారు. ఈ ప్రోమోలో చివరకు ఇంద్రజ అన్న మాటలకు నూకరాజు తల్లి ఇలా కౌంటర్ వేసింది.


ఇంత దూరం తీసుకొచ్చారు.. తాంబూలం మార్చుకునే సమయంలో పక్కకు జరిగారేంటి? అని ఇంద్రజ అడిగితే.. మేడం ఇది స్కిట్ వరకు అన్నారు.. నిజంగా అయితే కుదరదు మేడం అని ఖరాఖండిగా చెప్పేసింది. దీంతో నూకరాజు, ఆసియాలు తెల్లమొహం వేశారు. మరి నిజంగానే ఆమె అలా అనేసిందా? వారి ప్రేమకు అడ్డు పడిందా? లేదంటే ఇదంతా టీఆర్పీ కోసం, ప్రోమో కోసం వేసిన స్టంటా? అన్నది తెలియాల్సి ఉంది.


Also Read:  Veera Simha Reddy Break even : మరీ ఇంత దారుణమా?.. చిరు మీద ఇంత కక్షా?.. బాలయ్య మీద అంత ప్రేమనా?


Also Read: Chiranjeevi : సెట్‌కు వెళ్లే ముందు ఇంట్లో వంట మనిషితో.. ఆసక్తికరమైన విషయాన్ని చెప్పిన చిరంజీవి 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook