Sridevi Drama Company Promo : కాంతారా సినిమా దేశ వ్యాప్తంగా ఎంతటి సంచలనం క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం నేటికీ సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. నార్త్, సౌత్ అన్న తేడా లేకుండా ఈ చిత్రాన్ని ఆడియెన్స్ అంతా కూడా నెత్తిన పెట్టేసుకున్నారు. కేవలం పదిహేను కోట్లతో తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పుడు నాలుగు వందల కోట్ల క్లబ్బులోకి చేరింది. ఈ రేంజ్ సక్సెస్ రావడానికి కారణం మాత్రం రిషభ్ శెట్టి. అతని నటన, దర్శకత్వ ప్రతిభే కారణం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

క్లైమాక్స్‌ సీన్‌లో రిషభ్ శెట్టి నటించిన తీరుకు అందరూ ఆశ్చర్యపోయాయి. ఆస్కార్ లెవెల్ పర్ఫామెన్స్ అని, వచ్చే ఏడాది కచ్చితంగా మన దేశం తరుపున కాంతారాను నామినేట్ చేయాలని, బెస్ట్ యాక్టర్ కేటగిరీలో రిషభ్ శెట్టిని నామినేట్ చేయాలని అంతా డిమాండ్ చేస్తున్నారు. అంతటి పర్ఫామెన్స్, ఆ సీన్‌ను రీ క్రియేట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. కానీ తాజాగా జబర్దస్త్ కమెడియన్ నూకరాజు మాత్రం ఆ సాహసం చేశాడు.




శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోమో ఇప్పుడు ఒక్కసారిగా వైరల్ అవుతోంది. ఇందులో సుధీర్ మళ్లీ కమ్ బ్యాక్ ఇవ్వడం గురించి కాకుండా.. నూకరాజు పర్ఫామెన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. మామూలుగా అయితే యూట్యూబ్ కామెంట్లలో సుధీర్ అభిమానుల హంగామా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు మాత్రం నూకరాజు పర్ఫామెన్స్ గురించి మాట్లాడుతున్నారు. వా.. అంటూ రిషభ్ శెట్టి అరిచినట్టుగానే నూకరాజు అరవడం, అద్భుతంగా నటించడంతో ఆడియెన్స్ ఆశ్చర్యపోతోన్నారు.


నూకరాజు అర్పించాడు అబ్బా. పర్ఫామెన్స్ మాత్రం సూపర్ సూపర్,  నూకరాజు గారు విష్ యు ఆల్ ది బెస్ట్, నువ్వు కూడా సుదీర్ అన్న లాగా ఎదగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను, నూకరాజు కాంతారా పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవల్.. ఇలాంటి టాలెంట్డ్ పర్సన్‌ని ఎంకరేజ్ చేయాలి ఫ్రెండ్స్ అంటూ ఆడియెన్స్ కామెంట్లు పెడుతున్నారు.

Also Read : Rashmika Mandanna : డేటింగ్ రూమర్లు, ట్రోలింగ్‌పై ఆవేదన.. మీ వల్లే రిలేషన్ చెడిపోతోంది.. మనసులో బాధను బయటపెట్టేసిన రష్మిక మందన


Also Read : Sreemukhi Gangubhai look : గంగూభాయిలా మారిన శ్రీముఖి.. లుక్ అదిరిందిగా.. రాములమ్మ ఫోటోలు వైరల్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook