Jabardasth Satya Sri : చిరంజీవిపై జబర్దస్త్ సత్య శ్రీ అభిమానం.. ఆ గిఫ్ట్ ఒక్కటి చాలు.. అందులో ఏముందంటే?

Jabardasth Satya Sri Emotional జబర్దస్త్ సత్య శ్రీ తాజాగా తన మెగా అభిమానాన్ని చాటుకుంది. సత్య శ్రీ తాజాగా షేర్ చేసిన పోస్ట్ చూస్తే చిరంజీవి అంటే ఆమెకు ఎంత ఇష్టమో తెలుస్తోంది. తాజాగా ఆమె వేసిన పోస్ట్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
Jabardasth Satya Sri Emotional చిరంజీవికి అభిమాని కాని వారు ఉండటం చాలా అరుదు. బుల్లితెరపై, వెండితెరపై ఎంతో మంది చిరు అభిమానులే. ఇప్పుడు జబర్దస్త్ ఫేమ్ సత్య శ్రీ కూడా తన అభిమానాన్ని చాటుకుంది. సుమ అడ్డా షోలో వచ్చిన చిరంజీవిని ఇలా ప్రత్యేకంగా కలిసింది సత్య. ఊరికే కలవడం కాకుండా చిరంజీవి కోసం ఓ గిఫ్ట్‌ని కూడా తీసుకొచ్చింది. ఆ గిఫ్ట్ చూసి చిరంజీవి మురిసిపోయినట్టున్నాడు.
చిరంజీవి సినిమా పేర్లు వచ్చేట్టుగా ఓ కవిత్వం రాసుకుంది. సామాన్య కుటుంబంలో జన్మించి స్వయంకృషితో ఎదిగి ముందుకు అడుగులు వేసుకుంటూ ఎదురొచ్చిన ప్రతీ ముళ్లుని శుభలేఖగా స్వీకరిస్తూ సినీ వినీలాకాశంలో ఇంద్రుడవై కోట్ల మంది అభిమానుల గుండెల్లో ఖైదీవై అన్నయ్యగా అనేక మంది సినీ కార్మికులకు ఆపద్భాంధవుడిగా చిత్ర పరిశ్రమలో ఒక ఠాగూర్‌గా నూతన సినీ తరానికి ఒక ఆచార్యగా, చిత్ర పరిశ్రమకు ఒక గాడ్ ఫాదర్‌గా ఇప్పుడు వాల్తేరు వీరయ్యగా విజృంభిస్తున్న స్టార్ స్టార్ మెగా స్టార్ చిరంజీవి గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు అని చెబుతూ చిరంజీవి ఫోటోను గిఫ్ట్ ఇచ్చి ఇలా దానిపై తన ప్రేమకు అక్షర రూపాన్ని ఇచ్చింది.
ఇక చిరంజీవికి తాను ప్రత్యేకంగా తయారు చేసి ఇచ్చిన గిఫ్ట్‌ను ఇచ్చినట్టుగా సోషల్ మీడియా షేర్ చేసింది. అలా షేర్ చేస్తూ తన ఆనందాన్ని నెట్టింట్లో వ్యక్తం చేసింది. ఈ ఏడాది నాకు ఆల్రెడీ అద్భుతంగా మొదలైంది.. సుమ అడ్డా షోలో చేస్తున్నాను.. ఆ షోలో చిరంజీవి గారిని కలిశాను.. నాకు మాటల్లో చెప్పలేని ఆనందం కలుగుతోంది.. నా నుంచి ఈ చిన్న బహుమతిని చిరంజీవి గారికి ఇవ్వడం అమితమైన సంతోషాన్ని ఇచ్చింది.. చచ్చే వరకు చిరు మీదుండే గౌరవం ఏ మాత్రం తగ్గదు.. నాకు ఇలా ఆయన్ను కలిసే అవకాశం ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్ అని సత్య ఎమోషనల్ అయింది.
Also Read: Upasana Motherhood : ఈ సంక్రాంతికి మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నా.. ఉపాసన పోస్ట్ వైరల్
Also Read: Nandamuri Balakrishna Controversy : ఆ సందర్భంలో అలవోకగా వచ్చిన మాట మాత్రమే.. క్షమాపణలు కోరిన బాలయ్య
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook