Nandamuri Balakrishna Controversy : ఆ సందర్భంలో అలవోకగా వచ్చిన మాట మాత్రమే.. క్షమాపణలు కోరిన బాలయ్య

Nandamuri Balakrishna Controversy బాలయ్య తాజాగా ఓ వివాదంలో చిక్కుకున్నాడు. సమాజంలోని ఓ వర్గం వారిని కించపరిచేలా బాలయ్య మాట్లాడాడు. చరిత్ర తెలియకుండా తనకు తెలిసిన సమాచారాంతో మాట్లాడిన మాటలు ఇప్పుడు కాంట్రవర్సీకి దారి తీసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 15, 2023, 11:21 AM IST
  • కులాలపై బాలయ్య వ్యాఖ్యలు
  • దేవ బ్రాహ్మణ కులస్థుల ఆగ్రహం
  • క్షమాపణలు చెప్పిన నటసింహం
Nandamuri Balakrishna Controversy : ఆ సందర్భంలో అలవోకగా వచ్చిన మాట మాత్రమే.. క్షమాపణలు కోరిన బాలయ్య

Nandamuri Balakrishna Controversy దేవ బ్రాహ్మణ కులస్థులు, దేవాంగుల గురించి నందమూరి బాలకృష్ణ మాట్లాడిన మాటలు ఇప్పుడు కాంట్రవర్సీకి దారి తీస్తున్నాయి. దేవ బ్రాహ్మణులకు గురువు దేవళ మహర్షి అని, వారి నాయకుడు రావణాసురుడు అని చరిత్రని వక్రీకరించేలా మాట్లాడాడు అంటూ సదరు కుల సంఘం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. వెంటనే బాలయ్య క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. దీంతో బాలయ్య క్షమాపణలు చెబుతూ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు.

దేవబ్రాహ్మణులకు నాయకుడు రావణబ్రహ్మ అని తనకు అందిన సమాచారం తప్పు అని తనకు తెలియజెప్పిన దేవబ్రాహ్మణ పెద్దలందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని నందమూరి బాలకృష్ణ చెప్పుకొచ్చాడు.. తానన్న మాట వల్ల దేవాంగుల మనోభావాలు దెబ్బ తిన్నాయని తెలిసి చాలా బాధపడ్డానంటూ బాలయ్య ఈ ఎమోషనల్ నోట్ విడుదల చేశాడు.

తనకు ఎవరినీ బాధ పెట్టాలన్న ఆలోచన లేదని, అసలు ఆ ఉద్దేశ్యం తనకి ఉండదని తెలుగు ప్రజలందరికీ తెలుసంటూ చెప్పుకొచ్చాడు. దురదృష్టవశాత్తూ ఆ సందర్భంలో అలవోకగా వచ్చిన మాట మాత్రమేనని సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. అంతేకానీ సాటిసోదరుల మనసు గాయపరచటం వల్ల తనకు కలిగే ప్రయోజనం ఏముంటుంది చెప్పండి అంటూ ఎదురు ప్రశ్నించాడు బాలయ్య.

పైగా దేవాంగులలో నా అభిమానులు చాలామంది ఉన్నారని, తన వాళ్లను తానే బాధపెట్టుకుంటానా అని ఆవేదన వ్యక్తం చేశాడు. తనని అర్ధం చేసుకుంటారని భావిస్తున్నానని, పొరపాటును మన్నిస్తారని ఆశిస్తున్నానంటూ బాలయ్య ఓ ప్రెస్ నోట్ విడుదల చేశాడు. బాలయ్య మాత్రం ఇప్పుడు ఈ వివాదానికి పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశాడు. బాలయ్య చెప్పిన క్షమాపణలు, ఇచ్చిన వివరణతో సదరు వర్గం శాంతిస్తుందా? లేదా? అన్నది చూడాలి. ఏది ఏమైనా వీర సింహా రెడ్డి సినిమాతో బాలయ్య ఇప్పుడు థియేటర్లో సందడి చేస్తున్నాడు.

Also Read:  Upasana Motherhood : ఈ సంక్రాంతికి మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నా.. ఉపాసన పోస్ట్ వైరల్

Also Read: Vaarsudu Telugu Movie Review : విజయ్ వారసుడు రివ్యూ.. వంశీ పైడిపల్లి ఇక మారడు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News