Jabardasth Satya Sri : జబర్దస్త్ స్టేజ్ మీద ఎంతో మందికి పేరు వచ్చింది. ఊరు పేరు లేని వారికి ఇళ్లు, కార్లు కొనుక్కునే స్టేజ్‌ను ఇచ్చింది. అయితే జబర్దస్త్ స్టేజ్ మీద నుంచి ఎంతో మంది బయటకు వెళ్లారు. వెళ్తూనే ఉన్నారు.. వస్తూనే ఉన్నారు. అలా నాగబాబు బయటకు వెళ్లడంతో ఆయనతో పాటుగా చమ్మక్ చంద్ర వెళ్లాడు. చమ్మక్ చంద్ర వెళ్లడంతో సత్య కూడా వెళ్లింది. చమ్మక్ చంద్ర తన గురువు అని, ఆయన ఎక్కడుంటే తాను కూడా అక్కడే ఉంటాను అన్నట్టుగా ఇన్ని రోజులు సత్య చెప్పింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కానీ ఇప్పుడు మాత్రం చమ్మక్ చంద్రను వీడింది సత్య. చమ్మక్ చంద్ర సినిమాల్లో బిజీగా ఉండటంతో బుల్లితెరపై ఫోకస్ పెట్టడం లేదు. దీంతో ఆమెకు అక్కడ అంతగా పని లేకుండాపోయినట్టుంది. దీంతో సత్య మళ్లీ బుల్లితెరపై బిజీ కావాలని జబర్దస్త్ షోకు వచ్చినట్టుంది. గత వారమే సత్య ఎంట్రీ ఇచ్చింది. తన ఫస్ట్ స్కిట్ అయిన అనంతరం ఇలా ఎమోషనల్ అయింది సత్య.


 



నిజంగా నా కంట్లోంచి నీళ్లు వస్తున్నాయ్.. ఈ స్టేజ్‌ని నేను చాలా మిస్ అయ్యాను.. ఇది నా కుటుంబం.. మళ్లీ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.. బయటకు వెళ్తే ఉట్టి సత్య శ్రీ అని కాదు.. జబర్దస్త్ సత్య అని పిలుస్తుంటారు.. అప్పుడు నాకు సంతోషంగా ఉంటుంది..ఇప్పుడు అస్సలు గ్యాప్ ఇవ్వను.. తగ్గేదేలే అని సత్య శ్రీ ఎమోషనల్ అయింది.


ఇక సత్య తన జబర్దస్త్ స్కిట్ ఎపిసోడ్‌ వీడియోను ఇలా పోస్ట్ చేస్తూ.. నాకు పేరు, ప్రఖ్యాతలు ఇచ్చిన షో, స్టేజ్ ఇదే.. మళ్లీ ఇక్కడకు రావడం, ఈ కుటుంబంలో ఒకటిగా కలిసిపోవడం నాకు ఆనందంగా ఉంది.. ఇకపై మీ అందరినీ కచ్చితంగా ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను.. మల్లెమాల టీం మొత్తానికి థాంక్స్ అని సత్య శ్రీ ఎమోషనల్ అయింది. రోహిణిని ట్యాగ్ చేయడంతో.. ఇదంతా కూడా రోహిణి చేయించినట్టుగా అనిపిస్తోంది. రోహిణియే మల్లెమాల టీంకు, సత్యకు మధ్య వారధిగా నిలిచినట్టు కనిపిస్తోంది.


Also Read : Anasuya Bharadwaj : తాగుతారా? అంటూ నెటిజన్ ప్రశ్న.. చేతిలో ఒక్క షో లేకపోవడానికి కారణం చెప్పిన అనసూయ


Also Read : Rithu Chowdary: అందాల ప్రదర్శనతో రీతూ చౌదరి రచ్చ.. బాబోయ్ మైండ్ బ్లోయింగ్  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook