Jabardasth Vinod Ill news: జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా చాలా మంది కమెడియన్లుగా మంచి పేరు తెచ్చుకున్నారు. కొంత మంది ఇప్పటికే సినిమాల్లోకి వెళ్లి జబర్దస్త్ వదిలేస్తే మరి కొంతమంది మాత్రం ఇతర ఛానల్స్ కు వెళ్లి ఇతర ప్రోగ్రాములు చేస్తూ బిజీ బిజీగా మారుతున్నారు. అయితే ఎవరు ఏ ప్రదేశంలో ఉన్నా వారిని ఇప్పటికీ కూడా జబర్దస్త్ కమెడియన్స్ గానే గుర్తిస్తూ ఉంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలాంటి వారిలో వినోధిని అలియాస్ వినోద్ కూడా ఒకరు. కడప ప్రాంతానికి చెందిన వినోద్ సినిమాల్లో నటించాలనే అవకాశాల కోసం హైదరాబాద్ చేరుకోవడంతో అనుకోకుండా జబర్దస్త్ టీం కంట పడ్డారు. అలా మొదలై లేడి ఆర్టిస్ట్ గా లేడీ గెటప్స్ వేసుకొని ఆయన చేసే కామెడీ అందరికీ బాగా నచ్చేసింది.


చమ్మక్ చంద్రతో కలిసి అనేక స్కిట్లలో వినోద్ కనిపించాడు.  అయితే కొన్నాళ్ల నుంచి ఆయన పూర్తిగా జబర్దస్త్ కి దూరమైపోయాడు. అలాగే ఇతర చానల్స్ లో కూడా కనిపించడం లేదు. అతని గురించి ఎలాంటి వార్తలు కూడా బయటకు రాలేదు. అయితే తాజాగా వినోద్ ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వినోద్ పూర్తిగా బక్క చిక్కి కనపడటంతో అసలు వినోద్ కి ఏమైంది? అంటూ అందరూ ఆరా తీయడం మొదలుపెట్టారు.


అయితే అసలు విషయానికి వస్తే వినోద్ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నట్లుగా తెలిసింది, ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ రావడంతోనే పూర్తిగా బక్క చిక్కినట్లుగా దానివల్ల హెయిర్ లాస్ కూడా అయినట్లుగా వినోద్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు కొంచెం పర్వాలేదని తాను కోలుకున్నానని, తన కుటుంబం తన భార్య తనకు అండగా నిలబడి తనకు సేవలు చేసి మళ్ళీ మనిషిని చేశారని అని చెప్పుకొచ్చాడు.


ఎక్కువగా జంక్ ఫుడ్ తినడం, ప్రయాణాలు చేయడం, ఏసీలో ఎక్కువసేపు గడపడం, చల్లటి నీళ్లు తాగడం వంటి విషయాల వల్ల తనకు ఈ జబ్బు వచ్చిందని డాక్టర్లు చెప్పారని మీరందరూ కూడా ఇలాంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని వినోద్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అయితే తాను సుమారు 21 లక్షల రూపాయల మేర నష్టపోయినట్లు కూడా వినోద్ చెప్పుకొచ్చాడు తాను హైదరాబాదులో ఎలా అయినా ఇల్లు కొనుక్కోవాలి అనే ఉద్దేశంతో తాను అద్దెకు ఉంటున్న ఇంట్లోనే ఒక పోర్షన్ కొనుక్కోవాలని అనుకున్నానని అందులో భాగంగా ఇంటి ఓనర్ కు 13 లక్షలు ఇచ్చానని పేర్కొన్నారు. 10 లక్షలు ఒకసారి, మూడు లక్షలు ఒకసారి ఇచ్చామని, అందులో 10 లక్షలకు ప్రూఫులు ఉన్నాయి కానీ మరో మూడు లక్షలు ఇచ్చినట్లు మాత్రం ఎలాంటి ప్రూఫ్ లేదని అన్నారు.


మంచి మనిషి కదా అని నమ్మి ఇస్తే అసలు మీరు డబ్బులే ఇవ్వలేదు అన్నట్లుగా అడ్డం తిరిగాడని పూర్తిగా 13,00,000 వెనక్కి ఇచ్చేయమని అడిగితే ఇవ్వనన్నాడని ఇప్పుడు ఆ డబ్బు కోసం పోరాడుతున్నామని చెప్పుకొచ్చారు. అలాగే మరో పక్క ఒక వ్యక్తి అప్పు తీసుకుంటే తాను షూరిటీగా ఉన్నానని అతను ఎగ్గొట్టడంతో ఐదు లక్షలు రూపాయలు తాను కట్టాల్సి వచ్చిందని వినోద్ పేర్కొన్నారు. తర్వాత అనారోగ్యం నేపథ్యంలో దానికి, తన పరిస్థితి మారాలని తన తల్లి పూజలు చేయించిన క్రమంలో మరో మూడు లక్షల దాకా ఖర్చయిందని అలా మొత్తం మీద 21 లక్షలు రూపాయలు తాను నష్టపోయానని ఈ సందర్భంగా వినోద్ చెప్పుకొచ్చారు.


Also Read: Buttabomma poster copy: పోస్టర్ ను కూడా కాపీ కొట్టాలా..పాపం నాగవంశీని ఆడేసుకుంటున్నారుగా!


Also Read: Ashu Reddy Hot Photos: బ్లాక్ డ్రెస్సులో అషు రెడ్డి అందాల విందు.. ఎద అందాలన్నీ కనిపించేలా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.