Buttabomma poster copy: పోస్టర్ ను కూడా కాపీ కొట్టాలా..పాపం నాగవంశీని ఆడేసుకుంటున్నారుగా!

Buttabomma Poster Copied : బుట్టబొమ్మ అనే సినిమాను జనవరి 26వ తేదీన రిలీజ్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు, అయితే దానికి సంబందించిన ఒక పోస్టర్ రిలీజ్ చేయగా అవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Written by - Chaganti Bhargav | Last Updated : Dec 18, 2022, 11:58 AM IST
Buttabomma poster copy: పోస్టర్ ను కూడా కాపీ కొట్టాలా..పాపం నాగవంశీని ఆడేసుకుంటున్నారుగా!

Buttabomma Poster Copied from Nolan's The Prestige: సోషల్ మీడియా విరివిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఎలాంటి ఏ చిన్న తప్పు ఉన్నా అది బట్టబయలు అయిపోతుంది. సమాజంలో ఏదైనా తప్పు జరిగినా వెంటనే ఆ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో ఎలా వైరల్ అవుతున్నాయో సినిమాల విషయంలో ఏదైనా కాపీ కొట్టినా ఇంకేదైనా చేసిన సరే వెంటనే తెలిసిపోతున్నాయి.

గతంలో అనేక సినిమాల నుంచి ఇన్స్పిరేషన్ తో వేరే సినిమాలు చేస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా దెబ్బకి అలా చేస్తున్న వారందరూ వణికి పోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తాజాగా తెలుగులో బుట్ట బొమ్మ అనే సినిమా జనవరి 26వ తేదీన విడుదలయ్యేందుకు రంగం సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన చేస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేసింది సినిమా యూనిట్.

టాలీవుడ్ లో బడా నిర్మాణ సంస్థల్లో ఒకటిగా పేరు తెచ్చుకున్న సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ  బుట్ట బొమ్మ అనే సినిమాని నిర్మిస్తోంది. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన కప్పేలా అనే సినిమాకి తెలుగు రీమేక్ గా ఈ సినిమా రూపొందిస్తున్నారు. శౌరి చంద్రశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అర్జున్ దాస్, అనికా సురేంద్రన్, సూర్య వశిష్ట ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పలు ప్రమోషనల్ ఫోటోలు, వీడియోలకు మంచి స్పందన అయితే లభిస్తుంది.

తాజాగా ఈ సినిమా నుంచి ఒక పోస్టర్ విడుదల చేయగా ఆ పోస్టర్ కూడా కాపీ అనే తేల్చేశారు నెటిజనులు. ఏకంగా రెండు పోస్టర్లు పక్కపక్కనే పెట్టి మరి ఇక్కడి నుంచి ఎత్తుకొచ్చారంటూ కామెంట్లు చేస్తున్నారు. అసలు ఏమాత్రం మార్పులు కూడా చేయకుండా 2006లో నోలన్ దర్శకత్వంలో వచ్చిన ది ప్రెస్టేజ్ పోస్టర్ని బుట్ట బొమ్మగా దింపేయడం అందరికీ షాక్ కలిగిస్తోంది.

ఈ నేపథ్యంలోనే నిర్మాత నాగవంశీని నెటిజనులు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. వాస్తవానికి అవతార్ 2 సినిమా విషయంలో ఆయన పలు నెగిటివ్ కామెంట్స్ చేశారు. సినిమా ఏ మాత్రం బాలేదని అయినా జేమ్స్ కామెరాన్ సినిమా కాబట్టి చూడాలా అనే విధంగా కామెంట్లు చేశారు. ఇప్పుడు నాగావంశీని ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ టార్గెట్ చేసి మరీ ఆడుకుంటున్నారు నెటిజనులు.

Also Read: Ashu Reddy Hot Photos: బ్లాక్ డ్రెస్సులో అషు రెడ్డి అందాల విందు.. ఎద అందాలన్నీ కనిపించేలా!

Also Read: Vaani Kapoor Hot Photos: వాణి కపూర్ హాట్ ట్రీట్.. కేవలం లో దుస్తులలో రెచ్చిపోయిందిగా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News