Jacqueline Fernandez stopped at Mumbai airport: జాక్వెలిన్ ఫెర్నాండెజ్ దేశం విడిచి దుబాయ్ వెళ్తుండగా ముంబై ఎయిర్ పోర్టులో పోలీసులు అడ్డుకున్నారు. 200 రూపాయల కోట్ల ఎక్స్‌టార్షన్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కి ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసి ఉంది. అంతేకాకుండా జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ లుకౌట్ నోటీస్ కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 5, ఆదివారం నాడు ముంబై ఎయిర్ పోర్టు నుండి దుబాయ్ వెళ్తుండగా అధికారులు ఆమెను అడ్డుకున్నారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రూ. 200 ఎక్స్‌టార్షన్ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సుఖేష్ చంద్రశేఖర్‌తో జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కి సంబంధాలు కలిగి ఉన్నట్టుగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు భావిస్తున్నారు. సుఖేష్ చంద్రశేఖర్‌తో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కలిసి ఉండగా తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో వాళ్లిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి అనే కోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆరా తీస్తున్నారు. 


Also read : Can we check Omicron variant with booster dose: ఒమిక్రాన్ కేసులకు బూస్టర్ డోసులతో చెక్ పెట్టొచ్చా ?


ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు దర్యాప్తు చేస్తున్న ఈ మనీ లాండరింగ్ కేసులో సుఖేష్ చంద్రశేఖర్ భార్య, సినీ నటి లీనా మారియా పాల్‌కి కూడా సంబంధాలు ఉండి ఉంటాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ, వ్యాపార ప్రముఖులను బెదిరించి వారి నుంచి సుఖేష్ చంద్రశేఖర్ (Sukesh Chandrashekhar in extortion case) భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడినట్టు ఈడి అనుమానాలు వ్యక్తంచేస్తోంది. 


అక్టోబర్‌లో జరిగిన విచారణలో ఈడి అధికారులతో సుఖేష్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. అనేక మంది సెలబ్రిటీలకు తాను కోట్ల కొద్ది విలువైన బహుమతులు అందించినట్టు తెలిపాడు. అలా సుకేష్ చంద్రశేఖర్ (Sukesh Chandrasekhar) నుంచి ఖరీదైన బహుమతులు అందుకున్న సెలబ్రిటీల జాబితాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేరు కూడా ఉంది. 


Also read : Omicron cases in india: మహారాష్ట్రలో మరో 7 ఒమిక్రాన్‌ కేసులు.. ఇండియాలో ఒమిక్రాన్ కేసులు


జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కి సుకేష్ చంద్రశేఖర్ (Jacqueline Fernandez with Sukesh Chandrashekhar) సుమారు రూ. 10 కోట్ల విలువైన బహుమతులు అందించినట్టు జాక్వెలిన్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణాలతోనే ఈ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ వ్యవహారంపై జాక్వెలిన్ ఏమని స్పందిస్తుందో వేచిచూడాల్సిందే మరి.


Also read : Omicron cases in India: కర్ణాటకలో రెండు ఒమిక్రాన్ కేసులు.. కేంద్రం ఏం చెబుతోందంటే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook