Omicron: భారత్‌లో ఒమిక్రాన్ వేరియంట్ చాపకిందనీరులా విస్తరిస్తోంది. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య(Omicron Cases in India) 21కి చేరింది. తాజాగా మహారాష్ట్రలో 7, రాజస్థాన్ లో 9 కేసులు వెలుగుచూశాయి. గతంలో కర్ణాటకలో రెండు, గుజరాత్లో ఒకటి, దిల్లీలో ఒకటి, ముంబయిలో ఒకటి చొప్పున కేసులు నమోదైన సంగతి తెలిసిందే.
Also Read: Karnataka: కర్ణాటకలో 68 మంది విద్యార్థులకు పాజిటివ్
ఇటీవల దక్షిణాఫ్రికా(South Africa) నుంచి జైపూర్(Jaipur)కు వచ్చిన నలుగురిలో శాంపిల్స్ సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించగా ఒమిక్రాన్(Omicron) నిర్ధారణ అయ్యింది. వారితో పరిచయం ఉన్న మరో ఐదుగురిని పరీక్షించగా వారికీ పాజిటివ్‌గా తేలింది. వీరిలో ముగ్గురు చిన్న పిల్లలు ఉండటం విశేషం. ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలిన వారిని ఆర్యూహెచ్ఎస్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
నైజీరియా(Nigeria) నుంచి వచ్చిన మహారాష్ట్ర(Maharashtra)లోని పింప్రి చించ్వాడ్కు చెందిన ఓ మహిళ, ఆమె ఇద్దరు కుమార్తెలు, ఆ మహిళ సోదరుడు, అతడి ఇద్దరు కుమార్తెల్లో ఈ వేరియంట్ వెలుగుచూసింది. అలాగే ఫిన్లాండ్ నుంచి పుణె వచ్చిన మరో వ్యక్తిలోనూ ఈ రకం వైరస్ గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఒక్క మహారాష్ట్రలోనే ఒమిక్రాన్ కేసుల సంఖ్య 8కి చేరింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook