Jagapathi Babu 60th Birthday: నటుడు జగపతి బాబు అవ‌య‌వ‌దానంపై అవ‌గాహ‌న పెంచేందుకు నడుం బిగించారు. త‌న బర్త్‌ డే సందర్భంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. తన మ‌ర‌ణానంత‌రం.. అవ‌య‌వ‌దానం చేసేందుకు ఆయన ప్రతిజ్ఞ చేశారు. శనివారం జగపతి బాబు బర్త్‌ డే. ఈ రోజు ఆయన 60వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్‌లోని కిమ్స్‌ హాస్పిటల్‌లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో జగపతి బాబు తన అవ‌య‌వ‌దానం గురించి వెల్లడించారు. బర్త్‌ డే సందర్భంగా తాను ప‌ది మందికి ఉపయోగపడేలా ఏదైనా ఒక మంచి చేయాలనుకున్నాని జగపతి బాబు అన్నారు. అవ‌య‌వ‌దానం ప్రతిజ్ఞ.. చాలా మందికి స్ఫూర్తి క‌లిగిస్తుంద‌నే ఉద్దేశంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు జగపతి బాబు పేర్కొన్నారు.


మన మ‌ర‌ణానంత‌రం మనకు సంబంధించిన పలు అవయవవాలు ఇతరులకు అమ‌రిస్తే వాళ్లకు కొత్త జీవితం ఇచ్చినవాళ్లం అవుతామన్నారు. త‌న ఫ్యాన్స్‌ అంతా అవ‌య‌వ‌దానం చేసేందుకు ముందుకు రావాల‌ని ఆయన కోరారు. ఇక జగపతి బాబు నిర్ణయాన్ని అభినందిస్తూ కిమ్స్‌ హాస్పిటల్‌కు సంబంధించి పలువురు ప్రసంగించారు. 


త‌మ‌ వాళ్ల ప్రాణాలు పోతున్నాయ‌ని తెలిసి కూడా.. బాధ‌ను దిగ‌ మింగుకుంటూనే మ‌రి కొంద‌రి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ముందుకు రావ‌డం చాలా అభినందనీయ విషయమని కిమ్స్ హాస్పిటల్‌ చైర్మన్ డాక్టర్‌ భాస్కరరావు పేర్కొనారు. కరోనా స‌మ‌యంలో హాస్పిటల్‌లో చేరిన చాలా మంది పేద సినీ కార్మికుల హాస్పిటల్‌ బిల్లులను జగపతి బాబు చెల్లించారని ఆయన గుర్తు చేశారు. 


తాను ఎంతో అభిమానించే జ‌గ‌ప‌తిబాబు అవ‌య‌వ‌దానంపై నిర్ణయం తీసుకోవడం చాలా అభినందనీయమన్నారు. జగపతి బాబుతో స్ఫూర్తితో అందరూ అవ‌య‌వ‌దానానికి ముందుకు రావాల‌ని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి జ‌యేష్ రంజ‌న్‌, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవ‌య‌వ‌దానం చేసినటువంటి ప‌లువురు కుటుంబ‌ స‌భ్యుల్ని స‌న్మానించారు.


Also Read: Kalaavathi Song Promo: 'సూపర్ స్టార్' అభిమానులకు సర్‌ప్రైజ్‌.. ఫస్ట్ సింగిల్ అదిరిపోయిందిగా!!


Also Read: DJ Tillu: విజయ్ దేవరకొండను కాపీ కొడుతున్నారా.. హీరో సిద్ధు జొన్నలగడ్డ రియాక్షన్ ఇదే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook