Kalaavathi Song Promo: 'సూపర్ స్టార్' అభిమానులకు సర్‌ప్రైజ్‌.. ఫస్ట్ సింగిల్ అదిరిపోయిందిగా!!

Kalaavathi Song Promo: ప్రేమికుల రోజు సందర్భంగా 'సర్కారు వారి పాట' సినిమా నుంచి తొలి పాటను విడుదల చేస్తున్నట్లు ఇటీవల చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే.  తాజాగా ఆ పాటకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు మేకర్స్‌. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 11, 2022, 07:29 PM IST
  • మే 12న సర్కారు వారి పాట రిలీజ్
  • సూపర్ స్టార్ అభిమానులకు సర్‌ప్రైజ్‌
  • ఫస్ట్ సింగిల్ అదిరిపోయిందిగా
Kalaavathi Song Promo: 'సూపర్ స్టార్' అభిమానులకు సర్‌ప్రైజ్‌.. ఫస్ట్ సింగిల్ అదిరిపోయిందిగా!!

Kalaavathi Song Promo out from Sarkaru Vaari Paata Movie: టాలీవుడ్ 'సూపర్ స్టార్' మహేష్ బాబు హీరోగా నటిస్తోన్న చిత్రం 'సర్కారు వారి పాట'. పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన 'మహానటి' కీర్తి సురేష్ హీరోయిన్‏గా నటిస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా ఏడాదికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న 'సర్కారు వారి పాట' సినిమా 2022 మే 12న రిలీజ్ కాబోతోంది.

ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్భంగా 'సర్కారు వారి పాట' సినిమా నుంచి తొలి పాటను విడుదల చేస్తున్నట్లు ఇటీవల చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే.  తాజాగా ఆ పాటకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు మేకర్స్‌. కళావతి గ్లిమ్ప్స్ అని కాప్షన్ ఇచ్చారు. 'వందో.. ఓక వెయ్యో.. ఒక లక్షో మెరుపులు మీదికి దూకినయా! ఎందే ఈ మాయ. ముందో.. అటుపక్కో.. ఇటుదిక్కో చిలిపిగా తీగలు మోగినయా! పోయిందే సొయా!' అంటూ మహేశ్‌ బాబు కీర్తి సూరేశ్‌ను ఫాలో అవుతున్నారు.

కళావతి మెలొడీ సాంగ్ అన్ని వర్గాల శ్రోతల్ని అలరించేలా ఉంది. అనంత శ్రీరామ్‌ రచించిన ఈ గీతాన్ని స్టార్ సింగర్ సిధ్‌ శ్రీరామ్‌ ఆలపించారు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌ స్వరాలందించారు. తమన్‌ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టారు. దూకుడు, ఆగడు సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌ అన్న విషయం తెలిసిందే. యాక్షన్‌- కామెడీగ తెరకెక్కుతున్న 'సర్కారు వారి పాట' సినిమాను మైత్రీ మూవీ మేకరస్‌, 14 రీల్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. 

సర్కారు వారి పాట' సినిమాలో మహేష్ బాబు చిన్నప్పటి క్యారెక్టర్‌లో హీరో సుధీర్ బాబు చిన్న కుమారుడు దర్శన్ నటించాడు. ఈ విషయాన్ని సుధీర్ బాబు తాజాగా వెల్లడించారు. దర్శన్ జూనియర్ మహేష్ బాబుగా కనిపించబోతున్నాడు అంటే.. సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా ఉండబోతున్నట్లు స్పష్టం అయింది. మరి దర్శన్ ఎలా నటిస్తాడో చూడాలి. దర్శన్ ఇప్పటికే 2018లో వచ్చిన అడివి శేష్ స్పై థ్రిల్లర్ 'గూడాచారి'లో నటించాడు.

Also Raed: IND vs WI: విండీస్ టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్.. ఇద్దరు స్టార్ ప్లేయర్స్ దూరం!!

Also Read: Viral Video: ఆడ నాగు కోసం.. రెండు మగ నాగుల మధ్య 5 గంటల భీకర యుద్ధం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News