Jailer Producer: గొప్ప మనసు చాటుకున్న జైలర్ ప్రొడ్యూసర్.. అపోలో ఆస్పత్రికి కోటి రూపాయల విరాళం..
Jailer Movie: రజినీకాంత్, తమన్నా లీడ్ రోల్స్ లో నటించిన సినిమా జైలర్. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ మూవీ నిర్మాత కళానిధి మారన్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు.
Jailer Success Celebrations: సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన 'జైలర్' సినిమా ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్ పుల్ గా రన్ అవుతోంది. ఆగస్టు 10న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ రజినీ కెరీర్ లోనే ఊహించని వసూళ్లను సాధించింది. ఇప్పటికే ఈ సినిమా రూ. 650 కోట్లకుపైగా వసూలు చేసింది. సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో నిర్మాతలకు భారీగా లాభాలు వచ్చాయి. దీంతో ప్రొడ్యూసర్ కళానిధి మారన్ తనకు వచ్చిన లాభాల్లో కొంత మెుత్తాన్ని మూవీ టీమ్ కు చెక్ రూపంలో అందించడంతోపాటు కాస్ట్ లీ కార్లను కూడా గిప్ట్ గా ఇచ్చారు. జైలర్ సక్సెస్‌లో కీ రోల్స్ పోషించిన హీరో రజనీకాంత్, డైరెక్టర్ దిలీప్ నెల్సన్ కుమార్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌లకు చెక్ తోపాటు ఖరీదైన కార్లను బహుమతిగా ఇచ్చారు నిర్మాత కళానిధి మారన్.
జైలర్ మూవీతో వచ్చిన లాభాల్లో కొంత భాగాన్ని సామాజిక సేవా కార్యక్రమాల కోసం వినియోగిస్తున్నారు మారన్. ఇందులో భాగంగానే అపోలో ఆస్పత్రికి కోటి రూపాయలను విరాళాన్ని ప్రకటించారు. తాజాగా దీనికి సంబంధించిన చెక్‌ను కళానిధి మారన్ భార్య కావేరి అపోలో హాస్పిటల్స్ చైర్మన్, డాక్టర్ ప్రతాప్ చంద్రారెడ్డిని కలిసి అందించారు. ఈ విషయాన్ని తన అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ చేసింది సన్‌పిక్చర్స్ సంస్థ. 100 మంది పేద పిల్లల హార్ట్ సర్జరీల కోసం ఈ విరాళాన్ని ఇచ్చినట్లు తెలిపింది. దీనిపై నెటిజన్లు ప్రశంసలు వర్షం కురిపిస్తోంది.
జైలర్ సినిమా మరికొన్ని గంటల్లో ఓటీటీలో అందుబాటులోకి రానుంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇవాల్టి అర్ధరాత్రి నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఇది తెలుగుతోపాటు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో తమన్నా భాటియా, రమ్యకృష్ణ, శివరాజ్‌కుమార్, మోహన్ లాల్, జాకీ ష్రాఫ్ తదితరులు కీ రోల్స్ పోషించారు.
Also Read: Balagam Narsingam: టాలీవుడ్‌లో విషాదం.. బలగం నటుడు కన్నుమూత..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook