Jalsa Movie To Re Release on September 2nd: ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. ఇటీవల ఆగస్టు 9వ తేదీన మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన పోకిరి సినిమా రిలీజ్ చేశారు. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగానే కాకుండా విదేశాలలో కూడా మొత్తం కలిపి 400 షోస్ వేస్తే ఒక్క టికెట్ కూడా మిగలకుండా అవన్నీ హౌస్ ఫుల్స్ అయ్యాయి. ఈ నేపథ్యంలో సుమారు రెండు కోట్ల రూపాయల కలెక్షన్లు కూడా సాధించింది ఆ సినిమా.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపథ్యంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఏదో ఒక సినిమాని ఆయన పుట్టినరోజు సంధర్భంగా విడుదల చేయాలని ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదిక కోరుతున్న నేపథ్యంలో ఇప్పుడు జల్సా సినిమాని 4కె రెసొల్యూషన్ తో రిలీజ్ చేయడానికి రంగం సిద్ధమైంది. ఈ మేరకు కొబ్బరిమట్ట,  హృదయ కాలేయం సినిమాల దర్శకుడు సాయి రాజేష్ వెల్లడించారు.


తాను క్యూబ్ లో జల్సా సినిమా రీ రిలీజ్ ప్రింట్ చూశానని బాబు కొత్తగా కొన్న అద్దంలాగా మెరుస్తున్నాడని,  ఫాన్స్ ఇక సంబరాలకు సిద్ధం కావాలని పేర్కొన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ రెండవ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా అలాగే విదేశాల్లో సైతం ఈ సినిమా విడుదల చేయడానికి రంగం సిద్ధమవుతోంది. సుమారు 500 షోస్ వేసేలాగా ప్లాన్ చేసుకుంటున్నారు నిర్వాహకులు.


ఇక ఈ సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వం వహించగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఇలియానా అలాగే పార్వతీ మెల్టన్ హీరోయిన్లుగా నటించారు. గీతా ఆర్ట్స్ తెరకెక్కించిన ఈ సినిమాలో ముఖేష్ రిషి విలన్ గా నటించగా హీరోయిన్ తండ్రి పాత్రలో ప్రకాష్ రాజ్ కనిపించారు. ఇక ఈ సినిమాలో సంజయ్ సాహు అనే పాత్రలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అద్భుతమైన పెర్ఫామెన్స్ తో ప్రేక్షకులందరినీ ఆకట్టుకోవడమే గాక చాన్నాళ్ళ తరువాత సూపర్ హిట్ కూడా అందుకున్నాడు. అలాంటి సినిమా మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అంటే సాధారణ ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Also Read: Raju Shrivastava: తీవ్ర విషమంగా కమెడియన్ శ్రీవాస్తవ ఆరోగ్య పరిస్థితి!


Also Read: Macherla Niyojakavargam: ఊహించని విధంగా మాచర్ల నియోజకవర్గం మొదటి రోజు కలెక్షన్లు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.