Janhvi Kapoor Latest video జాన్వీ కపూర్‌ కొన్నేళ్లుగా ఓ హిట్ కొట్టాలని ప్రయత్నిస్తూనే ఉంది. మరాఠీ చిత్రం సైరాట్ రీమేక్‌గా ధడక్ అనే సినిమాతో బాలీవుడ్‌లో అడుగు పెట్టిసింది. రీమేక్ పరువు తీశారు అంటూ ట్రోల్స్ వచ్చాయి. కానీ జాన్వీ కపూర్ లుక్స్, అందానికి అంతా ఫిదా అయ్యారు. అందం ఎంతున్నా కూడా అదృష్టం మాత్రం ఆవగింజంతా కూడా లేనట్టుగా ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జాన్వీ కపూర్ సినిమాలన్నీ ఓటీటీలోనే వచ్చాయి. కరోనా సమయం కావడంతో ఆమె సినిమాలు ఎక్కువగా ఓటీటీలోనే విడుదలయ్యాయి. మిలీ అనే సినిమా థియేటర్లోకి వచ్చింది. గత ఏడాది ఈ సినిమాతో హిట్ కొట్టేస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఆ చిత్రం కూడా బొక్కబోర్లా పడింది. బాక్సాఫీస్ వద్ద జాన్వీ కపూర్ సినిమాలన్నీ బోల్తా కొడుతూనే ఉన్నాయి.


 



సినిమాల సంగతి ఎలా ఉన్నా కూడా జాన్వీ కపూర్ మాత్రం ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. నెట్టింట్లో ఆమె అందాలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ఇక ఆమె రహస్య ప్రియుడు, బాయ్ ఫ్రెండ్‌తో ఫోటోలు, డేటింగ్ రూమర్లతో ఎప్పుడూ జనాల నోళ్లలో నానుతూనే ఉంటుంది.


ఆమె అందాల ఆరబోతలో మాత్రం ఎటువంటి హద్దులు కనిపించవు. తాజాగా జాన్వీ కపూర్ ఓ వీడియోను షేర్ చేసింది. ఏదో సినిమా షూటింగ్‌లో జాన్వీ కపూర్ బిజీగా ఉంది. సెట్‌లో ఉన్న రంగులు చల్లుకుంటూ ఎంజాయ్ చేస్తోంది జాన్వీ కపూర్. మార్చిలో వచ్చే హోలీ వరకు ఆగలేకపోతోన్నాను అంటూ జాన్వీ కపూర్ కళ్లతోనే అందరినీ కవ్వించేసింది.


ప్రస్తుతం జాన్వీ కపూర్ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇక జాన్వీ కపూర్‌ను త్వరలోనే తెలుగు సినిమాల్లోకి తీసుకొస్తారట. ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాలో దాదాపుగా జాన్వీ కపూర్‌ను ఫిక్స్ చేశారని తెలుస్తోంది. మరి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందనేది చూడాలి.


Also Read:  Veera Simha Reddy Break even : మరీ ఇంత దారుణమా?.. చిరు మీద ఇంత కక్షా?.. బాలయ్య మీద అంత ప్రేమనా?


Also Read: Chiranjeevi : సెట్‌కు వెళ్లే ముందు ఇంట్లో వంట మనిషితో.. ఆసక్తికరమైన విషయాన్ని చెప్పిన చిరంజీవి 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook