Jani Master: జానీ మాస్టర్ ఎమోషనల్ పోస్ట్.. కన్న బిడ్డల్ని పట్టుకొని ఏడ్చిన వీడియో వైరల్..
Jani Master Emotional Video Viral: జానీ మాస్టర్ పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతుంది. ప్రస్తుతం అయిన బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ సందర్భంగా వారి ఫ్యామిలీతో కలిసి ఎమోషనల్ అయిన వీడియోను ఆయన షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Jani Master Emotional Video Viral: తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన జనీ మాస్టర్ అత్యాచారం ఘటన అందరికీ తెలిసిందే. అసిస్టెంట్ డ్యాన్స్ మాస్టర్ అత్యాచారం కేసులో 37 రోజులపాటు జైలు జీవితం గడిపిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. ఆయన బెయిల్‌పై ఇటీవలె విడుదలయ్యారు. వారి ఇంటికి చేరుకున్న సమయంలో ఆయన కుటుంబ సభ్యులతో ఎమోషనల్ అయ్యారు. తన కన్నబిడ్డలను పట్టుకొని ఏడ్చాడు. ఈ వీడియోలో తనతోపాటు భార్య ఇతర కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ముఖ్యంగా జానీ మాస్టర్ తన పిల్లలను పట్టుకుని చాలా ఎమోషనల్ అయ్యారు. ఈ వీడియోకు బ్యాగ్రౌండ్ సాంగ్ రణబీర్ కపూర్ 'యానిమల్' సినిమాలోని 'నాన్న నువ్వు నా ప్రాణం..' అనే హిందీలోని సాంగ్‌ను యాడ్ చేశారు. ఈ వీడియో జానీ మాస్టర్ బాగా ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది.
జానీ మాస్టర్‌ను పుష్ప2 కొరియోగ్రాఫీ నుంచి కూడా తప్పించినట్లు ఇటీవలె మీడియా వారు అడిగినప్పుడు చిత్ర బృందం తెలిపింది. ఇది జానీకి బిగ్ షాక్ అని చెప్పవచ్చు. అంతేకాదు ఆయన ఈ కేసుతోనే నేషనల్ అవార్డుకు కూడా దూరమయ్యారనే చెప్పవచ్చు. అయితే, జైలు నుంచి తిరిగి వచ్చిన జానీ సోషల్ మీడియాలో యాక్టీవ్ అయ్యారు. కొన్ని వీడియోలను షేర్ చేస్తున్నారు.
జానీ మాస్టర్ కేసు విషయానికి వస్తే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై అత్యాచారం చేశారని, మతం మార్చుకోమని వేధిస్తున్నారని కేసు పెట్టారు. దీంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మూడుసార్లు బెయిల్‌కు అప్లై చేశారు. జానీ మాస్టర్ వాళ్ల అమ్మకు కూడా గుండెపోటు వచ్చింది. అప్పుడు కూడా మాస్టర్ బెయిల్‌కు అప్లై చేశారు. అయినా కానీ, బెయిల్ మంజూరు కాలేదు. ఇటీవల 25వ తేదీ ఆయనుకు బెయిల్ మంజూరు అయింది. దీంతో ఆయన జైలులో గడిపిన జీవితానికి సంబంధించిన విషయాలను కూడా ఓ వీడియో చేసి షేర్ చేశారు. జానీ మాస్టర్ అత్యాచార ఘటన అయితే, తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.
ఇదీ చదవండి: ధంతేరస్ రోజు ఈ 2 వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే అంతులేని అదృష్టం ..
ఇదిలా ఉండగా ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో జానీ జైలు నుంచి వచ్చాక అతడిని ఫ్యామిలీ ఎలా రిసీవ్ చేసుకుంది వీడియో తీశారు. ఇందులో జానీ మాస్టర్ భార్య, పిల్లలను హత్తుకుని చాలా ఎమోషనల్ అయ్యారు. ఇది నెట్టింటా వైరల్‌గా మారింది. అంతేకాదు ఆ పోస్టులో నిజం ఎప్పటికైనా ఒకరోజు బయటపడుతుంది. నా కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల వల్ల ఇప్పుడు ఇక్కడ ఉన్నాను అన్నారు. 37 రోజుల జైలు జీవితం తర్వాత ఆయన కుటుంబ సభ్యులతో గడిపిన వీడియోను పంచుకున్నారు. కానీ, తాను ఎదురుకున్న ఈ దశ జీవితంలో ఎప్పటికీ గుచ్చుకుంటుంది అని జానీ మాస్టర్ షేర్ చేశారు.
ఇదీ చదవండి: జియో దీపావళి ధమాకా ఆఫర్స్.. రూ.899 రీఛార్జీ ప్యాక్‌పై రూ.3,350 బెనిఫిట్స్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter