Jr Ntr on Japan Earthquake: న్యూఇయర్ తొలి రోజే జపాన్ ను వరుస భూకంపాలు వణికించాయి. దాదాపు 21 సార్లు భూమి కంపించింది. ఈ ప్రకంపనల్లో ఒకటి రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రతగా నమోదైంది. భూకంపం నేపథ్యంలో ఆ దేశ పశ్చిమ తీర ప్రాంతంలో సునామీ హెచ్చరికలు జారీ చేసింది జపాన్ ప్రభుత్వం. ఈ అలలు అత్యధికంగా ఐదు మీటర్ల ఎత్తు వరకు ఉండొచ్చని పేర్కొంది. హోక్కాయిడో నుంచి నాగసాకి వరకు సునామీ ముప్పు ఉన్నట్లు అధికారులు తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎన్టీఆర్ దిగ్భ్రాంతి
తాజాగా ఈ ఘటనపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ''లాస్ట్ వీక్ అక్కడే ఉన్నాను. అదే ప్రాంతంలో భూకంపం రావడం నా హృదయాన్ని కలచివేసింది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు త్వరగా కోలుకోవాలి'' అని తారక్ ట్వీట్ చేశారు



వేల ఇళ్లకు కరెంట్ కట్..
ఈ భూకంపం ధాటికి జపాన్ లో దాదాపు 36వేళ ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దేశవ్యాప్తంగా ఉన్న అనేక రోడ్లకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఈ భూకంపం కారణంగా వాజిమా పట్టణంలో 8 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో రైలు, విమాన సేవలు నిలిపేశారు. రానున్న రోజుల్లో మరిన్ని భూకంపాలు సంభవించే అవకాశం ఉందని ఆదేశ  వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో టోక్యోలోని భారత రాయబార కార్యాలయం ఎమర్జెన్సీ కాంటాక్ట్‌ రూమ్‌ను ఏర్పాటు చేసి.. సిబ్బంది ఫోన్‌ నంబర్లు, మెయిల్‌ ఐడీలను అందుబాటులో ఉంచింది. 


Also read: Japan Earthquake: న్యూ ఇయర్ నాడు జపాన్‌ను వణికించిన భారీ భూకంపం, ఫోటోలు వైరల్


ఇదే కారణమా..
జపాన్ దేశం పసిఫిక్‌ రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌లో ఉండటం వల్ల తరుచూ భూకంపాలు సంభవిస్తాయి. ఏటా 5 వేల చిన్నా, పెద్ద భూకంపాలు నమోదవుతాయి. తాజాగా వచ్చిన ఎర్త్ క్విక్ 1983లో వచ్చిన సీ ఆఫ్‌ జపాన్‌ భూకంపంతో పోలిఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అప్పట్లో ఆ భూకంపం వల్ల 104 మంది మృతి చెందారు. వందల సంఖ్యలో గాయపడ్డారు. 2023 మే నెలలో జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 6.5 తీవ్రత నమోదైంది. ఒకరు మృతి చెందగా.. 13 మంది గాయపడ్డారు. 


Also Read: Japan Earthquake Scary Videos: జపాన్‌లో భారీ భూకంపం, భయపెడుతున్న వీడియోలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook