Jawan Collection: కింగ్ ఖాన్ షారుఖ్.. ఇండస్ట్రీలో పదేళ్లుగా చెప్పుకోదగ్గ పెద్ద హిట్ లేదు. అయిదేళ్లుగా గొప్ప సినిమానే లేదు.. ఇంక షారుఖ్ పని అయిపోయిందని అనుకున్నారంతా! కానీ, షారుఖ్ మాత్రం తన టైమ్ ఇంకా అయిపోలేదని సూపర్ హిట్ చిత్రంతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. బాలీవుడ్ చరిత్రలో ఎప్పుడూ కని విని ఎరుగని కంబ్యాక్ ఇదని విమర్శకులు అంటున్నారు. ఒకే ఏడాదిలో రెండు బిగ్గెస్ట్ హిట్స్ (పఠాన్, జవాన్) దక్కించుకోవడం చిన్న విషయం కాదని ఫ్యాన్స్ అంటున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఏడాది జనవరిలో 'పఠాన్' మూవీతో అలరించగా.. ఇప్పుడు 'జవాన్' సినిమాతో రికార్డులను బద్దలు కొట్టి, సరికొత్త ట్రెండ్ ను షారుఖ్ ఖాన్ సృష్టించారు. 'జవాన్' మూవీ విడుదలైన మొదటి రోజే రూ.129 కోట్ల కలెక్షన్స్ రాబట్టగా.. రెండో రోజు కూడా అదే జోరుతో రూ. 110 కోట్లను రాబట్టిన బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా విడుదలైన రెండు రోజుల్లో రూ. 240 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టినట్లు తెలుస్తోంది. 


సినిమా రిలీజైన రెండు రోజుల్లో రూ. 240 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టడం బాలీవుడ్ చరిత్రలోనే ఇదే అత్యధిక ఓపెనింగ్స్ అని విశ్లేషకులు అంటున్నారు. అయితే ఇప్పుడు వీకెండ్ కావడం వల్ల కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. రెండు రోజులతో పోలిస్తే.. శని, ఆదివారాలు ఎక్కువ మంది థియేటర్లకు వచ్చేందుకు అవకాశం ఉంది. 


Also Read: Drohi Movie First Look Poster: ద్రోహి మూవీ ఫస్ట్‌ లుక్‌ విడుదల.. డైరెక్టర్ క్రిష్‌ అభినందనలు  


అదే జరిగితే ఈ మూవీ ఫస్ట్ వీకెండ్ లోనే రూ. 500 కోట్ల బెంచ్ మార్క్ రీచ్ అవ్వడం పక్కా అని తెలుస్తోంది. అయితే షారుఖ్ ఖాన్ నటించిన 'పఠాన్' చిత్రం 25 రోజుల్లో రూ. 1000 కోట్లను రాబట్టింది. ఈ మార్క్ ను 'జవాన్' ఎన్ని రోజులకు రీచ్ అవుతుందో చూడాలి.


ఈ చిత్రంలో షారుఖ్ కు జోడిగా నయనతార నటించగా.. విలన్ గా విజయ్ సేతుపతి నటించాడు. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె, దళపతి విజయ్ గెస్ట్ రోల్స్ లో కనిపించారు. ఇందులో ప్రియమణి, సాన్యా మల్హోత్రా, యోగిబాబు, సునీల్ గ్రోవర్ తదితరులు కీ రోల్స్ లో నటించారు. ఈ మూవీకి అనిరుధ్ సంగీతం అందించాగా.. తాజాగా ఈ మూవీపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కూడా ట్వీట్ చేశాడు. ఈ సినిమాను చూసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు పేర్కొన్నాడు. 


Also Read: Jawan Mahesh Babu: మహేష్ బాబు రివ్యూ..'జవాన్' మూవీ అదిరిపోయింది"!!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook