Jawan Mahesh Babu: మహేష్ బాబు రివ్యూ..'జవాన్' మూవీ అదిరిపోయింది"!!

షారుఖ్ ఖాన్ - తమిళ డైరెక్టర్ కాంబోలో వచ్చిన సినిమా 'జావన్'. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమా అటు దక్షణ భారత దేశ భాషల్లో కూడా విడుదలైంది. ఈ సినిమా గురించి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతుంది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 8, 2023, 08:37 PM IST
Jawan Mahesh Babu: మహేష్ బాబు రివ్యూ..'జవాన్' మూవీ అదిరిపోయింది"!!

Jawan Mahesh Babu: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్.. తమిళ దర్శకుడు అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం 'జవాన్'. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు సునామీని సృష్టిస్తోంది. ఈ సినిమా విజయంపై ఫ్యాన్స్ తో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా మూవీ టీమ్ కి శుభాకాంక్షలు చెబుతున్నారు. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా సోషల్ మీడియాలో ఈ సినిమా రివ్యూ చెప్పారు. మూవీ బ్లాక్ బాస్టర్ అంటూ వెల్లడించారు. 

అయితే ఈ సినిమా రిలీజ్ కు ముందు 'జవాన్' మూవీ టీమ్ కు విషెస్ తెలియజేశారు సూపర్ స్టార్ మహేష్ బాబు. మూవీ విడుదలైన తర్వాత ఆ సినిమా ఎలా ఉందో ట్విట్టర్ (X) లో పోస్ట్ పెట్టారు. అంతే కాదు, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ఓ లెజెండ్ అంటూ సంభోధించారు. 

"జవాన్ మూవీ బ్లాక్ బాస్టర్ మూవీ. దర్శకుడు అట్లీ కింగ్ ఖాన్ తో కింగ్ సైజ్ ఎంటర్‌టైన్మెంట్ ను అందించారు. షారుక్ ఖాన్ కెరీర్ లోనే ఉత్తమ చిత్రంగా నిలిచిపోయింది. ఆయన (షారుక్) స్క్రీన్ ప్రెజన్స్, ఛరిష్మాను ఎవరూ అందుకోలేరు. వెండితెరపై స్క్రీన్ మీద చెలరేగిపోయారు. గత చిత్రాల రికార్డులను మళ్లీ ఆయనే బ్రేక్ చేస్తారు. సినిమా చాలా బాగుంది. లెజెండ్స్ లో ఉన్న స్టఫ్ ఇది" అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు. 

Also Read: Petrol And Diesel Prices: శుభవార్త.. పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

ఈ పోస్టుతో షారుఖ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన ట్వీట్ కు దర్శకుడు అట్లీ ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే మహేష్ ను కలుస్తానని ఆయన ట్వీట్ చేశారు. 

షారుఖ్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో 'జవాన్' మూవీ తెరకెక్కింది. హిందీలోనే కాకుండా దక్షిణాది భాషలన్నింటిలోనూ ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా భారీగా విడుదల చేశారు. ఈ మూవీలో నయనతార హీరోయిన్ గా నటించగా.. విజయ్ సేతుపతి విలన్ పాత్ర పోషించారు. వీరితో పాటు దీపికా పదుకొణె, ప్రియమణి తదితరులు నటించారు.

Also Read: Huawei Mate X5 Price: చీప్‌ అండ్‌ బెస్ట్‌ ఫోల్డబుల్ మొబైల్‌ వచ్చేసింది..ధర తెలిస్తే షాక్‌ అవుతారు!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News