Jhanvi Kapoor:దేవర లుక్ తో శ్రీదేవిని గుర్తు చేసిన జాన్వి కపూర్..
Devara:యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకుడిగా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా దేవర. బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో ఆమె పాత్ర పేరుని ప్రకటించుకుంటూ తన ఫస్ట్ స్టిల్ ను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది జాన్వి కపూర్.
Jahnvi Kapoor as Thangam:ఒకప్పటి స్టార్ హీరోయిన్ శ్రీ దేవి, ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోని కపూర్ ల మొదటి కూతురు జాన్వి కపూర్ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. తాజాగా జాన్వి కపూర్ ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం కాబోతోంది.
కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ హీరోగా వస్తున్న రెండవ సినిమా ఇది. ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో ఈమె ఒక పల్లెటూరు అమ్మాయి పాత్రలో కనిపించబోతోంది అని వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా జాన్వి కపూర్ షూటింగ్ సెట్స్ నుంచి తన ఫోటోని షేర్ చేస్తూ తన పాత్ర పేరు తంగం అని సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది. "షూటింగ్ సెట్స్ తో పాటు చిత్ర బృందం, తంగం పాత్ర నీ, బాగా మిస్ అవుతున్నాను" అంటూ ఆ ఫోటో కింద క్యాప్షన్ కూడా రాసింది ఈ భామ. ప్రస్తుతం ఆ పోస్ట్, ఫోటో మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో నిజంగానే ఒక పల్లెటూరి అమ్మాయిలాగా చేతికి మట్టి గాజులు, లంగా వోని వేసుకుని, జడ వేసుకుని జాన్వీ కపూర్ ఫోటోలో అందంగా పోజ్ ఇచ్చింది. ఇక అతి త్వరలోనే సినిమాకి సంబంధించిన ఒక బీచ్ సాంగ్ షూటింగ్ జరగబోతుందని దానికోసం ఈమె గోవా కూడా వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది.
రెండు భాగాలుగా విడుదల కాబోతున్న ఈ సినిమా మొదటి భాగం దేవర పార్ట్ వన్ వచ్చే ఏడాది ఏప్రిల్ 5న థియేటర్లలో విడుదల కాబోతోంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, నరైన్, మురళీ శర్మ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. యువ సుధా ఆర్ట్స్ తో ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
అనిరుధ్ రవి చందర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకి ఆర్ రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ పోస్టర్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. సినిమా కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read: Chandrababu Case Updates: చంద్రబాబుకు ఊరట, మద్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook