Jhanvi Kapoor: మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ వశిష్ట మల్లిడి దర్శకత్వంలో తాజాగా రూపొందుతున్న చిత్రం విశ్వంభర.  అయితే దసరా పండుగ సందర్భంగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు మేకర్స్. మెగా అభిమానులతో పాటు ప్రతి ఒక్కరూ కూడా విశ్వంభర విజువల్స్ కి ఫిదా అయిపోయారని చెప్పవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముఖ్యంగా టీజర్ విడుదలైన తర్వాత ప్రముఖ డైరెక్టర్ బుచ్చి బాబు సనా షేర్ చేసిన ఒక వీడియో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ వీడియోలో విశ్వంభర  సినిమా టీజర్ చూసి బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఎక్స్ప్రెషన్స్ కి అందరూ ఫిదా అవుతున్నారు. మరోవైపు  జగదేకవీరుడుతో అతిలోకసుందరి డాటర్ అంటూ ఈ వీడియోకి బుచ్చిబాబు కామెంట్ కూడా పెట్టారు.



సంక్రాంతి సందర్భంగా విడుదల కావాల్సిన ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవ్వడంతో పాటు విఎఫ్ఎక్స్ వర్క్ కూడా ఎక్కువగా పెండింగ్ ఉన్న కారణంగా సంక్రాంతి బరి నుంచి చిరంజీవి తప్పుకున్నారు.  ఆస్థానంలోకి రాంచరణ్ గేమ్ ఛేంజర్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే . 



సంక్రాంతికి విశ్వంభర లేదని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో దసరా సందర్భంగా టీజర్ ను  విడుదల చేశారు. ఇక అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. అయితే ఎప్పటిలాగే కొంతమంది ట్రోల్స్ చేసినా టీజర్ కి మంచి స్పందన లభిస్తూ ఉండడం గమనార్హం. 


ఇక విశ్వంభరా టీజర్ చూస్తూ జాన్వీ కపూర్ ఇచ్చిన విజువల్స్ కి షాక్ అయిన వీడియోని దర్శకుడు బుచ్చిబాబు షేర్ చేశారు. మరోవైపు బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా జాన్వీ కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం స్క్రిప్ట్ చర్చల సందర్భంగా బుచ్చిబాబు విశ్వంభర టీజర్ ను జాన్వి కపూర్ కి చూపించడం జరిగింది. ఆ సమయంలో ఆమె షాక్ అయిందట. ఇక జగదేకవీరుడితో అతిలోకసుందరి కూతురు జాన్వి కపూర్ అంటూ  విశ్వంభర టీజర్ తో పాటు ఆమె ఎక్స్ప్రెషన్ ఇచ్చిన వీడియోని కూడా షేర్ చేశారు. మొత్తానికైతే ఈ వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి 



దేవరా సినిమాలో హీరోయిన్ గా నటించిన జాన్వి కపూర్ తన అందంతో మంచి మార్కులు వేయించుకుంది. అంతేకాదు రాంచరణ్ మూవీ లో కూడా తన అందంతో పాటు నటనతో కూడా మెప్పించడం ఖాయం అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఉప్పెన సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న బుచ్చిబాబు సన ఈ సినిమాను రూ.100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. మరి ఈ ముగ్గురి కాంబినేషన్లో వస్తున్న సినిమా ఎటువంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.


ఇదీ చదవండి:  Salary Hike: ప్రభుత్వం భారీ‌ గుడ్‌న్యూస్‌.. టీచర్ల జీతం మూడురెట్ల పెంపు..!



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.