John Abraham as villain in Salaar movie: బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే అంతో ఇంటో బాలీవుడ్ సినిమాలు చూసేవాళ్లకెవరికైనా జాన్ అబ్రహం గురించి తెలియకుండా ఉండదు. ప్రభాస్ లాగే ఆరు అడుగుల ఆజానుబావుడు. జిస్మ్, సత్యమేవ జయతే, పర్మాను: ది స్టోరీ ఆఫ్ పోక్రాన్, మద్రాస్ కేఫ్ లాంటి చిత్రాలు జాన్ అబ్రహం కెరీర్‌లో చెప్పుకోదగిన చిత్రాల్లో కొన్ని. జాన్ అబ్రహం పరిచయం సంగతి పక్కనపెడితే.. ప్రస్తుతం అంతగా లైమ్‌లైట్‌లో లేని ఈ బాలీవుడ్ స్టార్‌కి తాజాగా ఓ బంపరాఫర్ వచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేజీఎఫ్ చిత్రాల ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తోన్న సలార్ మూవీలో మన డార్లింగ్, ఆరు అడుగుల ఆజానుబావుడు ప్రభాస్‌కి విలన్‌గా జాన్ అబ్రహంని తీసుకుంటున్నట్టు బాలీవుడ్ టాక్. దాదాపు నాలుగైదు నెలల నుంచే ఈ టాక్ వినిపిస్తున్నప్పటికీ తాజాగా అది కన్ఫర్మ్ అయినట్టు బాలీవుడ్ మీడియా వర్గాలు చెబుతున్నాయి. ప్రభాస్ లాంటి పర్సనాల్టీతో ఫైటింగ్ సీక్వెల్స్ బాగా రావాలంటే మళ్లీ అలాంటి ఫిజిక్ ఉంటేనే బాగుంటుందనే ఉద్దేశంతో ప్రశాంత్ నీల్ వెళ్లి జాన్ అబ్రహంని కలిసి స్టోరీ చెప్పగా.. అతడు సైతం ఫుల్ ఖుషీ అయ్యాడట. 


Also read : Jr NTR: కరోనా నుంచి కోలుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, థ్యాంక్స్ చెబుతూ ట్వీట్


జాన్ అబ్రహంకి కూడా సలార్ మూవీ స్క్రిప్ట్ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశాడట. దీంతో ఇక ఇప్పుడు జాన్ అబ్రహం రెమ్యునరేషన్ (John Abraham remuneration for Salaar movie), అతడి డేట్స్ తీసుకునే పనిలో ప్రశాంత్ నీల్ టీమ్ బిజీగా ఉందని తెలుస్తోంది. ప్రభాస్, జాన్ అబ్రహం కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటే ఎలా ఉంటుందో చూడాలని అప్పుడే ప్రభాస్ ఫ్యాన్స్ (Prabhas) ఉవ్విళ్లూరుతున్నారు.


Also read: Allu Arjun గురించి యాంకర్ Anasuya ఏమందో తెలుసా ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook