Jr NTR: కరోనా నుంచి కోలుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, థ్యాంక్స్ చెబుతూ ట్వీట్

Jr NTR Recovered From Covid-19 | ఇటీవల టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కరోనా మహమ్మారిని జయించాడు. తాజాగా ఈ జాబితాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేరిపోయాడు. తాను కరోనా బారి నుంచి కోలుకున్నానంటూ నందమూరి అభిమానులకు, టాలీవుడ్ ప్రేక్షకులకు శుభవార్త చెప్పాడు.

Written by - Shankar Dukanam | Last Updated : May 25, 2021, 01:05 PM IST
  • టాలీవుడ్ ప్రేక్షకులు, నందమూరి అభిమానులకు శుభవార్త
  • కరోనా మహమ్మారిని జయించిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్
  • తాను కరోనా నుంచి కోలుకున్నానని ట్విట్టర్ ద్వారా వెల్లడి
Jr NTR: కరోనా నుంచి కోలుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, థ్యాంక్స్ చెబుతూ ట్వీట్

టాలీవుడ్ ప్రేక్షకులకు, అందులోనూ నందమూరి ఫ్యామిలీ అభిమానులకు శుభవార్త. ఇటీవల కరోనా వైరస్ బారిన పడిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కోలుకున్నాడు. కోవిడ్19 మహమ్మారిని జయించానని ఈ స్టార్ హీరో స్వయంగా వెల్లడించాడు. మెగా హీరో అల్లు అర్జున్ సైతం ఇటీవల కరోనా నుంచి కోలుకున్నాడు.

కరోనా సెకండ్ సినీ సెలబ్రిటీలు పలువురు కోవిడ్19 మహమ్మారి బారిన పడుతున్నారు. ఈ క్రమంలో రెండు వారాల కిందట జూనియర్ ఎన్టీఆర్‌కు కరోనా సోకింది. తాను ఐసోలేషన్‌లో ఉన్నానని, త్వరలో కోలుకుంటానని ఇటీవల ట్వీట్ చేయడం తెలిసిందే. తాజాగా తాను కరోనా మహమ్మారిని జయించానని, తనకు కరోనా నెగెటివ్ అని తెలిపాడు. తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన, తనకు మద్దతుగా నిలిచిన అందరికీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Junior NTR) ధన్యవాదాలు తెలిపాడు.

Also Read: NTR Birthday: అభిమానులకు ఎన్టీఆర్ విన్నపం, కావాలంటే అప్పుడు వేడుక చేసుకుందామని ట్వీట్

కరోనా మహమ్మారిని జయించడంలో భాగంగా తనకు చికిత్స అందించిన కిమ్స్ వైద్యులు డాక్టర్ ప్రవీణ్ కులకర్ణి, తన కజిన్ డాక్టర్ వీరులకు, టెనెట్ డయాగ్నోస్టిక్స్‌కు ప్రత్యేకంగా కృత‌జ్ఞత‌లు తెలిపాడు. వీరి సహకారం వల్లే తాను కోవిడ్19(COVID-19) నుంచి కోలుకున్నానని తన ట్వీట్‌లో ఎన్టీఆర్ పేర్కొన్నాడు. కెరీర్ విషయానికొస్తే ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీ ప్రాజెక్టుతో బిజీగా ఉన్నాడు. లాక్‌డౌన్, కరోనా కారణంగా కొంతకాలం నుంచి షూటింగ్ పనులు వాయిదా వేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News