Devara part 2 twist revealed: కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం దేవర.  సెప్టెంబర్ 27వ తేదీన విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.  మొదటి రోజే రూ.172 కోట్లు కలెక్షన్స్ వసూల్ చేసిన ఈ సినిమా ఇండియాలోనే అత్యధిక కలెక్షన్లు తొలిరోజు వసూలు చేసిన చిత్రంగా మూడవ స్థానాన్ని దక్కించుకుంది. అంతేకాదు ఈ సినిమా నాన్ రాజమౌళి రికార్డులను సైతం బ్రేక్ చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఏమైందో తెలియదు కానీ గత రెండు మూడు రోజుల నుంచి సినిమా కలెక్షన్స్ తగ్గుతున్నాయి.  దీనికి కారణం ప్రమోషన్స్ చేయకపోవడమే అని సమాచారం నిజానికే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలనుకున్నప్పుడు ఆ ఈవెంట్ కి అనూహ్యంగా పెద్ద సంఖ్యలో అభిమానులు రావడంతో భద్రత కారణంగా ఈవెంట్ క్యాన్సిల్ చేశారు. ఇక సినిమా సక్సెస్ అయిన తర్వాత ఈవెంట్ పెట్టుకుందాం అంటే ప్రభుత్వం నుండి పర్మిషన్ రావట్లేదు. అందుకే చిత్ర బృందంతో చాలా సింపుల్ గా ఈవెంట్ ముగించేశారు. 


ఇకపోతే ఇప్పుడు సినిమాపై హైప్ పెంచడానికి అటు కొరటాల శివ ఇటు ఎన్టీఆర్ ఇద్దరూ కూడా ప్రమోషన్స్ చేపడుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ప్రముఖ బుల్లితెర యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న సుమా.. కొరటాల శివ,  ఎన్టీఆర్ తో ఇంటర్వ్యూ చేశారు. ఈ నేపథ్యంలోనే దేవర  సీక్వెల్ నుంచీ పలు  విషయాలను రాబట్టే ప్రయత్నం చేశారు సుమా. 


అసలు విషయంలోకి వెళ్తే.. దేవర సినిమాలో సముద్రంపై తీసిన యాక్షన్ సన్నివేశాలు సినిమాకే హైలెట్ గా నిలిచిన విషయం తెలిసిందే.  అయితే ఆ సముద్రంలో ఎన్నో స్కెలిటెన్స్ ను.. మనకు మొదటి సన్నివేశంలోనే చూపించారు. మరి ఈ స్కెలిటన్ ఎవరివి అంటూ సుమా ప్రశ్నించింది.


దానికి కొరటాల శివ మాట్లాడుతూ.. సినిమాలో ఇద్దరూ మెయిన్ వ్యక్తులు ఉన్నారు కదా.. ఆ మెయిన్ వ్యక్తులలో ఒకరిది ఆ స్కెలిటన్ అంటూ ఆయన హింట్ ఇచ్చాడు. కాదా దేవర సినిమాలో యతి అనే కీలక పాత్ర.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ పాత్ర బాబీ డియల్ చేయబోతున్నారు అని కూడా వినికిడి. ఇక ఈ యతి పాత్రదేనా ఆ స్కెలిటన్ అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఇకపోతే ఇంకా ఎన్నో విషయాలను సుమా రాబట్టే ప్రయత్నం.. చేసింది కానీ అందులో డైరెక్టర్ , ఎన్టీఆర్ చాలా తెలివైన వాళ్ళు కాబట్టి ఎక్కడ కూడా నోరు జారకుండా చాలా తెలివిగా తప్పించుకునే ప్రయత్నం చేశారు. మొత్తానికైతే.. యతి క్యారెక్టర్ దే ఆ స్కెలిటన్ అన్నట్టు నెటిజన్స్ కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.  మరి ఆ స్కెలిటన్ ఎవరిదో తెలియాలి అంటే.. కచ్చితంగా సీక్వెల్ చూడాల్సిందే అంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.



 




 


ఇదీ చదవండి: Devara Villain Saif: దేవర విలన్ బైరాకు వైయస్ఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా..


ఇదీ చదవండి: Pawan Kalyan Second Daughter: పవన్ కళ్యాణ్ చిన్న కూతురును చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో..!


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి