Mahesh Babu and Jr NTR : మెగాస్టార్ చిరంజీవి,‌ అలానే రామ్ చరణ్ ఏ పండుగ అయినా సంబరంలా జరుపుకోవడానికి ముందుంటారు. మెగా ఫ్యామిలీతో అలానే టాలీవుడ్ ఇండస్ట్రీ సెలబ్రిటీస్ తో రామ్ చరణ్ ఎన్నో ఫంక్షన్స్ లో పాల్గొనడం మనం చూస్తూనే ఉంటాం. అంతేకాదు తన ఇంట్లో కూడా సరదాగా జరుపుకునే వాటిని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటూ ఉంటారు ఈ మెగా ఫ్యామిలీ హీరోలు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ నేపథ్యంలో రామ్ చరణ్ నిన్న దీపావళి సందర్భంగా అందరికీ ఒక మంచి పార్టీ ఇచ్చారట. ఈ పార్టీ నుంచి ఇప్పటికే బయటకు వచ్చిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.




ఈ పార్టీ గురించి చెప్పుకోదగ్గ విషయం ఏమిటి అంటే.. రామ్ చరణ్ దీపావళి పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ అలానే మహేష్ బాబు ఇద్దరూ కూడా అటెండ్ అయ్యారు. మహేష్ బాబు తన భార్య నమ్రిత శిరోద్కర్ తో ఈ పార్టీకి వచ్చినట్టు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటోలలో జూనియర్ ఎన్టీఆర్ తన దేవర సినిమా లుక్ తో రఫ్ గా కనిపించగా…మరోపక్క మహేష్ బాబు తన గుంటూరు కారం లుక్ తో స్టైలిష్ గా కనిపించారు.


ఇక వీరిద్దరూ ఫోటోలు చూసిన వీరిద్దరి అభిమానులు తెగ సంతోష పడిపోతున్నారు. మరోపక్క ఈ ఈవెంట్లో వరుణ్ తేజ్ లావణ్య హైలైట్ గా నిలిచారట. మొన్ననే పెళ్లయిన ఈ జంట ఈ ఈవెంట్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచి అందరినీ ఆకట్టుకున్నారట.




మరి ఈవెంట్ నుంచి మరికొన్ని ఫోటోలు వీడియోలు వస్తే తెలుగు సినీ అభిమానులు వీటిని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేయడం ఖాయం.


కాగా సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న గేమ్ చేంజర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇక మహేష్ బాబు, త్రివిక్రమ్ దర్శకత్వంలో రాబోతున్న గుంటూరు కారం సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. మరోపక్క జూనియర్ ఎన్టీఆర్ తనకు జనతా గ్యారేజ్ లాంటి బ్లాక బస్టర్ ఇచ్చిన కొరటాల శివతో దేవరా సినిమా తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం రెండు పార్ట్ లగా విడుదల కానుంది.


Also Read: Unknown Facts About Chandra Mohan: చంద్రమోహన్ గురించి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..ఆయనకు గుర్తింపు తెచ్చిన సినిమా ఇవే! 


Also Read:  Delhi Air Pollution: ఢిల్లీపై కరుణించిన ప్రకృతి, వర్షం కారణంగా పెరిగిన గాలి నాణ్యత



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.TwitterFacebook