RRR Movie to collects 200 to 250 crores at 1st Day Box Office: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 'ఆర్‌ఆర్‌ఆర్‌' మేనియా పట్టుకుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ నామస్మరణే మార్మోగిపోతోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి మల్టీ స్టారర్ సినిమాగా ఎస్‌ఎస్ రాజమౌళి తెరకెక్కించిన సినిమా ఈరోజు విడుదల అయింది. ఆర్ఆర్ఆర్ సినిమా ఇప్పటికే పలు ప్రాంతాల్లో బెనిఫిట్, స్పెషల్ షోలు పడ్డాయి. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ సినిమా చూసేందుకు థియేటర్లకు బారులు తీరారు. దాంతో దేశంలోని ప్రధాన నగరాల్లో అభిమానుల సందడి భారీ స్థాయిలో ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముందునుంచి కూడా ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సినిమా తొలి రోజు ఎంత కలెక్షన్లు చేస్తుందోనని ట్రేడ్‌ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతుంది. అంచనాలకు తగ్గట్టే సినిమాకు సంబంధించి కొద్దిరోజుల వరకు అన్ని టికెట్లు కూడా బుక్‌ అయిపోయాయి. రికార్డు స్థాయిలో టికెట్లు హాట్‌ కేకుల్లా అమ్ముడయ్యాయి. దీంతో రిలీజ్‌కు ముందే ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం భారీ వసూళ్లు చేసి రికార్డు సృష్టించింది. ఇక తొలిరోజు కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వస్తాయని అనలిస్ట్ లు అభిపాయపడుతున్నారు. 


ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా అంచనా ప్రకారం.. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 200 నుంచి రూ. 250 కోట్లు వసూలు చేస్తుందట. ఓపెనింగ్ డే బాక్సాఫీస్ కలెక్షన్లు ఎక్కువగా తెలంగాణ, ఏపీ నుంచి వస్తాయని అంచనా వేశారు. తెలుగు రాష్ట్రాల్లో టిక్కెట్ ధరలు పెరగడం, దాదాపు 95 శాతం థియేటర్లలో సినిమా ప్రదర్శించడం, స్టార్ తారాగణం నేపథ్యంలో 100 నుంచి 110 కోట్లు కలెక్షన్స్ వస్తాయని రమేష్ బాలా అంచనా వేశారు. ఇక ఓవర్సీస్‌లో యుఎస్ అగ్రస్థానంలో ఉంటుందన్నారు. ఇతర దేశాల కలెక్షన్లను కూడా కలుపుకుంటే.. ఓవర్సీస్‌లో 10 మిలియన్ల కలెక్షన్లను నమోదు చేయడం ఖాయం అని అంచనా వేశారు.


తెలుగు రాష్ట్రలో ముందస్తు బుకింగ్ అద్భుతంగా ఉన్నా.. మిగతా రాష్ట్రాల్లో అంతగా లేవని ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా పేర్కొన్నారు. కర్ణాటకలో రూ. 10 నుంచి రూ. 15 కోట్ల ఓపెనింగ్ వసూళ్లు వస్తాయన్నారు. తమిళనాడులో రూ. 10 కోట్లు, కేరళలో రూ. 4 కోట్ల ఓపెనింగ్ బాక్సాఫీస్ కలెక్షన్లు వస్తాయని ఆయన అంచనా వేస్తున్నారు. ఐదు సంవత్సరాల క్రితం బాహుబలి 2 మొదటి రోజు 40 కోట్లు వసూల్ చేసింది.


Also Read: RRR Movie Review: ఆర్‌ఆర్‌ఆర్‌ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?


Also Read: Petrol price Today: మళ్లీ భగ్గుమన్న పెట్రోల్, డీజిల్ రేట్లు- కొత్త ధరలు ఇవే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook