RRR Movie Review: ఆర్‌ఆర్‌ఆర్‌ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

RRR Movie Review. స్టార్ డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆర్‌ఆర్‌ఆర్‌ రివ్యూ ఓసారి చూద్దాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 25, 2022, 10:02 AM IST
  • ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఆర్‌ఆర్‌ఆర్‌
  • ఆర్‌ఆర్‌ఆర్‌ రివ్యూ
  • ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ఎలా ఉందంటే?
RRR Movie Review: ఆర్‌ఆర్‌ఆర్‌ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

సినిమా: ఆర్‌ఆర్‌ఆర్‌
నటీనటులు: ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, అలియా భట్‌, శ్రియ, సముద్రఖని, ఓలివియా మోరిస్‌, రేస్టీవెన్‌ సన్‌ తదితరులు సంగీతం: ఎం.ఎం.కీరవాణి
సినిమాటోగ్రఫీ: కె.కె.సెంథిల్‌ కుమార్‌
ఎడిటింగ్‌: శ్రీకర్‌ ప్రసాద్‌ 
కథ: విజయేంద్ర ప్రసాద్‌ 
మాటలు: సాయి మాధవ్‌ బుర్రా
నిర్మాత: డీవీవీ దానయ్య 
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎస్‌.ఎస్‌.రాజమౌళి
విడుదల: 25-03-2022

ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. స్టార్ డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇద్దరు అగ్ర హీరోలు, స్టార్ డైరెక్టర్ కాంబో కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందులోనూ అల్లూరి సీతారామరాజుగా చరణ్‌, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ నటిస్తుండటంతో ఈ సినిమాపై మరింత హైప్ నెలకొంది. బాహుబలి 2 వచ్చాక ఐదేళ్ల తర్వాత జక్కన్న తెరకెక్కించిన ఈ సినిమా కథ ఏంటో తెలుసుకుందాం. 

కథ:
నిజాం పరిపాలనలో ఉన్న తెలంగాణలోని ఓ గిరిజన ప్రాంతంలో ఆర్ఆర్ఆర్ కథ మొదలైంది. 1920 బ్రిటిష్ ప్రభుత్వంలో విశాఖపట్టణం సమీపానికి చెందిన రామరాజు (రామ్‌ చరణ్‌) పోలీస్ అధికారిగా పనిచేస్తుంటాడు. ఇక నిజాంను కలవడానికి వచ్చిన ఓ బ్రిటిష్ దొర (రే స్టీవెన్‌సన్‌) ఓ గోండు పిల్లను బలవంతంగా తీసుకువెళ్తాడు. ఇది అన్యాయమని ఎదిరించిన ఆ చిన్నారి కుటుంబాన్ని హింసిస్తారు. గోండు జాతికి కాపరి లాంటి కొమరం భీమ్ (ఎన్టీఆర్‌)కి ఈ విషయం తెలుస్తోంది. ఢిల్లీకి వెళ్లిన కొమురం భీమ్.. తమగూడెం పిల్ల కోసం దొరలపై తిరుగుబడి చిన్నారిని రక్షిస్తాడు. దాంతో కొమురంను ఎలాగైనా పట్టుకునే బాధ్యతను బ్రిటీష్ ప్రభుత్వం సీతారామరాజుకు అప్పగిస్తోంది. అయితే కొమురం నిజాయితీ, మంచితనం నచ్చిన రామరాజు అతనికి సాయం చేస్తాడు. బ్రిటీష్ ప్రభుత్వానికి ఎదురు తిరిగినందుకు రామరాజుకు బ్రిటీషు ప్రభుత్వం మరణ శిక్ష విధిస్తుంది. రామరాజును కొమురం కాపాడుతాడా లేదా?.. వీరి స్నేహం చివరకు ఎలాంటి మలుపు తీసుకుంది?.. బ్రిటిష్ ప్రభుత్వంపై ఏ విధంగా పోరాటం జరిగింది? అనేది మిగిలిన కథ.

ఎవరెలా చేశారంటే:
నటీనటుల విషయానికి వస్తే.. ముందుగా ఎన్టీఆర్, రామ్ చరణ్ గురించి మాత్రమే చెప్పుకోవాలి. ఎన్టీఆర్‌, చరణ్‌ల నటన ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటుంది. ఇద్దరి పాత్రల మధ్య ఎమోషన్స్ గుండె బరువెక్కేలా ఉన్నాయి. ఇద్దరు స్టార్లు వారి పాత్రల్లో ఒదిగిపోయిన తీరు, పోరాట ఘట్టాల్లో అభినయం చాలా బాగుంది. ఇక 'నాటు నాటు' పాటలో ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేసిన తీరు మహా అద్భుతం. ఎన్టీఆర్‌, చరణ్‌లు సినిమాకు ప్రాణం పోశారు. ఇక బాలీవుడ్ స్టార్ అలియా భట్‌ సీత పాత్రలో ఒదిగిపోయింది. అజయ్ దేవగణ్ పాత్ర సినిమాకి కీలకం. శ్రియ సరన్ చిన్న పాత్రలో మెరిసినా ఆకట్టుకుంది. సముద్రఖని, రాహుల్ రామకృష్ణ, రావురమేష్ తదితరులు తమతమ పాత్రల పరిధి మేర చక్కటి నటన ప్రదర్శించారు.

పనితీరు:
ఆర్ఆర్ఆర్ సినిమాను రాజమౌళి కన్న కలను తెరపై అద్భుతంగా ఆవిష్కరించారు. జక్కన్న ఏ సినిమా తీసినా.. దానిని జ‌నం మెచ్చేలా చెక్కడానికి చాలా స‌మ‌యం తీసుకుంటారు. ఆర్ఆర్ఆర్ రూప‌క‌ల్పన‌లోనూ అదే ప్రయ‌త్నం చేశారు. ప్రేక్షకులు ఎక్కడ ఏం కోరుకుంటారో అవన్నీ పక్కాగా జోడిస్తూ ఈ సినిమాని తీర్చిదిద్దారు. మొత్తానికి అభిమానులు గర్వపడేలా సినిమాను తీశారు. ఇక ఈ సినిమా సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. ఎంఎం కీరవాణి సంగీతం నేపథ్య సంగీతం, పాటలు సినిమాకి ప్రధాన బలం. సెంథిల్ కెమెరా పనితనం బాగుంది. ప్రతి సన్నివేశాన్ని చాలా గ్రాండ్‌ లుక్‌లో ఉన్నాయి. నిర్మాణం పరంగా హంగులు అడుగడుగునా కనిపిస్తాయి.

బలాలు:
ఎన్టీఆర్‌, రామ్‌చరణ్ నటన
కథ, పోరాట ఘట్టాలు
రాజమౌళి మార్క్
సెంథిల్ కుమార్ టేకింగ్ 
కథలో మలుపులు

బలహీనతలు:
అక్కడక్కడ కథ నెమ్మదించడం
క‌థ నిడివి ఎక్కువ‌ కావడం

రేటింగ్
3.5

గమనిక: ఈ సమీక్ష కేవలం ప్రేక్షకుడి దృష్టికోణానికి సంబంధించింది మాత్రమే. 

Also Read: RRR Movie: ఏఎంబీ మాల్‌లో ఆర్‌ఆర్‌ఆర్‌ స్పెషల్ షో.. సినిమాపై జూనియర్ ఎన్టీఆర్ రియాక్షన్..!!

Also Read: MS Dhoni: ప్రపంచకప్ ట్రోఫీతో వచ్చాడు.. ఐపీఎల్ టైటిల్‌తో ముగించాడు! కెప్టెన్‌గా ముగిస్తే బాగుండు!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News