NTR Upcoming Bollywood Movies: ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ కు నార్త్ లో కూడా ఫ్యాన్ బేస్ విపరీతంగా పెరిగింది. బాలీవుడ్ స్టార్స్ ఎందరో ఎన్టీఆర్ తో కలిసి వర్క్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ నటిస్తున్న దేవర చిత్రంతో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తెలుగు తెరకి పరిచయం కాబోతోంది. ప్రస్తుతం ఎన్టీఆర్, హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీతో ఎన్టీఆర్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తారక్ అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్ సారథ్యంలో తెరకెక్కుతున్న ఈ స్పై సినిమాటిక్ యూనివర్స్ లో ఎన్టీఆర్ భాగం కావడం అతని అభిమానులకు ఎంతో గర్వకారణంగా మారింది. అయితే తాజాగా యష్ రాజ్ ఫిల్మ్స్ నుంచి వచ్చిన రెండు అప్డేట్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అందులో మొదటిది వార్ సినిమాలో ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన అప్డేట్. నిన్న మొన్నటి వరకు ఎన్టీఆర్ ఈ మూవీలో నెగిటివ్ పాత్ర పోషిస్తాడు అన్న టాక్ వినిపిస్తూ వచ్చింది. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ రా ఏజెంట్ గా కనిపించబోతున్నాడు అని సమాచారం. శక్తి మూవీ లో స్పెషల్ ఆఫీసర్ గా దర్శనమిచ్చిన ఎన్టీఆర్.. ఆ తర్వాత కొన్ని సినిమాలలో పోలీస్ ఆఫీసర్ గా నటించి మెప్పించాడు.


అయితే ఇప్పుడు ఏకంగా తమ అభిమాన హీరో రా ఏజెంట్గా కనిపిస్తాడు అనే న్యూస్ ఎన్టీఆర్ అభిమానులను ఫుల్ ఖుష్ చేస్తోంది. ఇక యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ స్పై యూనివర్స్ లో ఎన్టీఆర్ తో సపరేట్గా సింగిల్ ఫిలిం కూడా ఉండబోతుందని టాక్. అంతే కాకుండా ఈ యూనివర్స్ లో రాబోయే మిగిలిన సినిమాలలో ఎన్టీఆర్ గెస్ట్ అపీరియన్స్ ఇచ్చే అవకాశం కూడా ఉంది అని టాక్. అలాగే ధూమ్ 4 చిత్రంలో షారుక్ తో పాటు ఎన్టీఆర్ కూడా ఓ కీలకమైన పాత్ర పోషించే అవకాశం ఉంది అని సమాచారం.ఆర్ఆర్ఆర్ తో వరల్డ్ వైడ్ పాపులారిటీ తెచ్చుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు దేవర చిత్రంతో పాన్ ఇండియా లెవెల్ లో వైరల్ అవ్వడానికి సిద్ధపడుతున్నాడు. ఈ మూవీ తరువాత అతనికి బాలీవుడ్ లో ఛాన్సులు మరింత పెరిగే అవకాశం ఖాయం అంటున్నారు తారక్ అభిమానులు.


Read More: Insulin: ఇన్సులిన్ ఉత్పత్తి తక్కువగా ఉందా? ఈ 3 ఆకులను నమిలండి చాలు.. షుగర్ కంట్రోల్ అవుతుంది..!


Read More: Pooja Hegde: పొట్లంకట్టిన బిర్యానికి బొట్టు బిళ్ళ పెట్టినట్టు.. ఆకట్టుకుంటున్న పూజా హెగ్డే ఫోటోలు


 



 


 


 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook