Pooja Hegde: పొట్లంకట్టిన బిర్యానికి బొట్టు బిళ్ళ పెట్టినట్టు.. ఆకట్టుకుంటున్న పూజా హెగ్డే ఫోటోలు

Pooja Hegde Rare Photos: తన అందం... అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న హీరోయిన్ పూజ హెగ్డే. సినిమాలతోనే కాకుండా తన ఇంస్టాగ్రామ్ ఫోటోల ద్వారా కూడా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

  • Mar 04, 2024, 20:28 PM IST
1 /6

మాస్క్ అనే తమిళ సినిమాతో తెరంగేట్రం చేసింది హీరోయిన్ పూజ హెగ్డే. ఆ తరువాత నాగచైతన్య హీరోగా చేసిన ఒక లైలా కోసం.. వరుణ్ తేజ్ హీరోగా చేసిన ముకుందా సినిమాలతో మంచి పేరు తెచ్చుకుంది.  

2 /6

తెలుగులో స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడే హిందీలో హృతిక్ రోషన్ తో మొహెంజో దారో చిత్రంలో కనిపించి మెప్పించింది. అయితే పూజకి హిందీలో కన్నా తెలుగులోనే అప్పట్లో ఎక్కువగా అవకాశాలు వచ్చాయి..

3 /6

కెరియర్ స్టార్టింగ్ లోనే రంగస్థలం లాంటి సినిమాలో ఐటమ్ సాంగ్ చేసిన ఈ హీరోయిన్.. త్రివిక్రమ్ సినిమాలు అరవింద సమేత..అల వైకుంఠపురములో తో భారీ సక్సెస్ లు అందుకుంది.

4 /6

కానీ గత కొద్ది కాలంగా మాత్రం పూజా టైం పెద్దగా బాగోలేదు. ఆమె నటించిన చిత్రాలు అన్ని వరుసగా ఫ్లాప్ అయ్యాయి.‌ ముఖ్యంగా బీస్ట్, రాధేశ్యామ్‌, ఆచార్య, సర్కస్ లాంటి సినిమాలు ఆమె కెరియర్ లోనే డిజాస్టర్స్ గా మిగిలాయి. 

5 /6

ఈ నేపథ్యంలో తదుపరి సినిమాలతో అయినా పూజ మంచి విజయాలు సాధిస్తుందా లేదా అని ఆమె అభిమానుల్లో కలవరం మొదలైంది.

6 /6

అయితే తాజాగా పూజ షేర్ చేసిన ఇంస్టాగ్రామ్ ఫోటోలు మాత్రం ఆమె అభిమానులను తెగ ఖుషి చేస్తున్నాయి. బ్లాక్ శారీలో ఎంతో అందంగా కనిపిస్తూ అందరిని ఫిదా చేసింది ఈ హీరోయిన్. అంతేకాకుండా తన పోస్ట్ కి ‘పొట్లం కట్టిన బిర్యానికి బొట్టు బిళ్ళ పెట్టినట్టు’ అంటూ అలా వైకుంఠపురంలో రాములో రాములో పాటను క్యాప్షన్ గా పెట్టేసింది ఈ హీరోయిన్