Aay OTT Platform: జూనియర్ ఎన్టీఆర్ బావమర్ది నార్నె నితిన్ హీరోగా.. అంజి మణిపుత్ర దర్శకత్వంలో వచ్చిన సినిమా ఆయ్.  నయన్ సారిక హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం గోదావరి బ్యాక్ డ్రాప్ లో ఫ్రెండ్షిప్ నేపథ్యంతో యూత్‌పుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా.. ఆగ‌స్టు 15న ప్రేక్ష‌కుల ముందుకువ‌చ్చింది. చిన్న బడ్జెట్ తో వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం పెద్ద విజయం సాధించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

డబల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ లాంటి సినిమాలు ఈ చిత్రంతో పాటు విడుదలైనప్పటికీ.. ఆ రెండు సినిమాలు డిజాస్టర్ గా మిగలగా.. ఈ సినిమా మాత్రం సూపర్ సక్సెస్ అందుకుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి లాభాలు తెచ్చుకుంది ఈ చిత్రం. ఇక గత వారం నుంచి ఈ చిత్రం కలెక్షన్స్ జోరు కొంచెం కొంచెం తగ్గుతుండగా.. ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వ‌స్తుందా అని చాలా మంది ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక వారందరికీ కూడా సూపర్ అప్డేట్ వచ్చేసింది.


ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్సైంది. ఈ సినిమా ఓటీటీ హ‌క్కుల‌ను ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇక నెట్ఫ్లిక్స్ ఈ సినిమాని.. సెప్టెంబ‌ర్ 12 నుంచి స్ట్రీమింగ్ చేయ‌నున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో తెలిపింది. 


‘ఊరిలో ఎదవలు అంటే అందరూ మొదటగా అనుకునేది వీళ్ళనే.. ఆయ్.. వీళ్ళు ఫ్రెండ్స్ అండి.. వీళ్ళని నెట్ ఫ్లిక్స్ లో సెప్టెంబర్ 19 నుంచి చూడండి’ అంటే పోస్ట్ వేసింది నెట్ ఫ్లిక్స్. కాగా ఈ సినిమాని GA2 బ్యానర్ పై బన్నీ వాసు, విద్య కొప్పినీడి నిర్మించారు. ఈ చిత్రంలో సీనియర్ నటుడు వినోద్ కుమార్, రాజ్ కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, మైమ్ గోపి.. పలువురు కీలక పాత్రల్లో కనిపించారు..


 



ఇక తన మొదటి చిత్రం మ్యాద్ తో మంచి విజయం అందుకున్న నర్నే నితిన్.. ఈ సినిమాతో మరో సూపర్ సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం ఈ హీరో చేతిలో మరో రెండు ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. అవి కూడా విజయం సాధిస్తే.. నార్నే నితిన్ ప్రస్తుత తరం హీరోల్లో.. ప్రత్యేక స్థానం సంపాదించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.


Also Read: Virat Kohli: భారత్‌కు దూరంగా కోహ్లీ, అనుష్క.. బ్రిటన్‌లో సెటిల్ అయ్యేందుకు ప్లాన్..! 


Also Read: Traffic Restrictions: ఖైరతాబాద్‌ వెళ్లే వాహనదారులకు బిగ్‌ అలెర్ట్‌.. వినాయక చవితి సందర్భంగా ఈ రూట్లలో ట్రాఫిక్‌ మళ్లింపులు.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.