Jr NTR Devara Bad Sentiments:  తెలుగు సినీ ఇండస్ట్రీలో రాజమౌళి సినిమా చేసిన ఏ హీరోకు కూడా అంత ఈజీగా సక్సెస్ దక్కలేదు. అందులో ఎన్టీఆర్ మూడు సార్లు ఆ సెంటిమెంట్ కారణంగా హిట్ కోసం ఎన్నో ఏళ్లు వేచి చూశాడు. రాజమౌళి దర్శకత్వంలో చేసిన ‘స్టూడెంట్ నెంబర్ 1’ సినిమా తర్వాత ‘సుబ్బు’ సినిమాతో ఫ్లాప్ అందుకున్నాడు.  అటు ‘సింహాద్రి’ తర్వాత ‘ఆంధ్రావాలా’తో బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్నాడు. అటు ‘యమదొంగ’ సినిమా తర్వాత ‘కంత్రి’ సినిమాతో ఫ్లాప్ అందుకున్నాడు.అటు ప్రభాస్, రామ్ చరణ్, నాని సహా ఎంతో మంది హీరోలు రాజమౌళితో సినిమా చేసిన తర్వాత హిట్టు కోసం యేళ్లకు యేళ్లు ఎదురు చూసారు.కానీ ఎన్టీఆర్ మాత్రం ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో చేసిన ‘దేవర’ తో హిట్ అందుకొని .. రాజమౌళి సెంటిమెంట్ కు పాతర వేసాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంకోవైపు ఎన్టీఆర్ తండ్రీ కొడుకులుగా నటించిన ‘ఆంధ్రావాలా’, ‘శక్తి’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్స్ గా నిలిచాయి. అటు ఈ బ్యాడ్ సెంటిమెంట్ కారణంగా మరోసారి అలాంటి పాత్రలో నటించడానికి ఏ హీరో అయినా.. జంకుతాడు. కానీ ఎన్టీఆర్ మాత్రం స్టోరీకి అనుగుణంగా ఈ సినిమాలో మరోసారి తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసారు. ఈ మూడు సినిమాల్లో తండ్రి ఎన్టీఆర్ పాత్ర చనిపోవడం గమనార్హం. మొత్తంగా తండ్రీ కొడుకులుగా నటిస్తే ఫ్లాప్ అవుతుందనే బ్యాడ్ సెంటిమెంట్ ను కూడా బ్రేక్ చేసాడు ఎన్టీఆర్.


ఒకపుడు హిట్ ఇచ్చిన దర్శకుల వెంట పడే ఎన్టీఆర్.. తాజాగా ఫ్లాప్ డైరెక్టర్స్ కు లైఫ్ ఇస్తున్నాడు. గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన హరీష్ శంకర్ తో ‘రామయ్యా వస్తావయా’ సినిమాతో ఫ్లాప్ అందుకున్నాడు. ‘కందిరీగ’తో హిట్ అందుకున్న సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘రభస’ సినిమా చేసి చేతులు  కాల్చుకున్నాడు. అంతకు ముందు ‘అతనొక్కడే’ వంటి హిట్ అందుకున్న సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘అశోక్’ సినిమా చేసాడు. ఈ రకంగా హిట్ ఇచ్చిన దర్శకుల వెంట పడేవారు.


ఇదీ చదవండి: Devara Villain Saif: దేవర విలన్ బైరాకు వైయస్ఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా..


ఇదీ చదవండి: Pawan Kalyan Second Daughter: పవన్ కళ్యాణ్ చిన్న కూతురును చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో..!


ఆ తర్వాత ఫ్లాపుల్లో ఉన్న పూరీ జగన్నాథ్ తో ‘టెంపర్’ మూవీ చేసి హిట్ అందుకున్నాడు. అటు నేనొక్కడినే వంటి ఫ్లాప్ మూవీ చేసిన సుకుమార్ తో ‘నాన్నకు ప్రేమతో’ సినిమా చేసి సక్సెస్ అందుకున్నాడు. అటు ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ మూవీతో ఫ్లాప్ లో ఉన్న బాబీ దర్శకత్వంలో ‘జై లవకుశ’ సినిమా చేసి సక్సెస్ అందుకున్నాడు. పవన్ కళ్యాణ్ తో ‘అజ్ఞాతవాసి’తో డిజాస్టర్ ఇచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. తాజాగా ‘ఆచార్య’ వంటి డిజాస్టర్ ఇచ్చిన కొరటాల శివతో ‘దేవర’ సినిమాతో హిట్ అందుకున్నాడు.


ఇదీ చదవండి:  Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..


అంతేకాదు ‘దేవర’ సినిమా విడుదలైన ఆరు రోజుల్లో అన్ని ఏరియాల్లో  బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని క్లీన్ హిట్ గా నిలిచింది. మొత్తంగా ‘టెంపర్’ నుంచి మొదలు పెడితే.. దేవర’ వరకు వరుసగా ఏడు సక్సెస్ లతో తెలుగులో ప్రస్తుతం ఏ యంగ్ హీరోకు లేని సక్సెస్ రేట్ తో దూసుకుపోతున్నాడు. ఈ సినిమా ఆరు రోజుల్లో దాదాపు రూ. 395 కోట్ల గ్రాస్.. రూ. 222 కోట్ల షేర్ రాబట్టి బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. తాజాగా దసరా సెలవుల నేపథ్యంలో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ మేరకు వసూళ్లను రాబడుతుందో చూడాలి.


ఇదీ చదవండి:  Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.