Jr NTR Brother In Law: బావ బామ్మర్దులు తమ సినిమాలు సూపర్‌ హిట్‌ కావడంతో జోష్‌ మీదున్నారు. ఈ క్రమంలోనే బామ్మర్దికి బావ ఘనంగా నిశ్చితార్థం వేడుక నిర్వహించాడు. అతడే మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌. అతడి బామ్మర్ది.. యువ హీరో ఎర్నేని నాని ఎంగేజ్‌మెంట్‌ ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. సినీ ప్రముఖులతోపాటు ఎన్టీఆర్‌ కుటుంబసభ్యులు, పలువురు వీఐపీలు హాజరయ్యారు. ఈ వేడుకలో ఎన్టీఆర్‌ కుటుంబం చేసిన సందడికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Amaran 3 Days WW Box Office Collections: ‘అమరన్’ 3 డేస్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. మొత్తం వసూళ్లు ఇవే..


జూనియర్‌ ఎన్టీఆర్‌ బావమరిది, లక్ష్మీ ప్రణతి సోదరుడు నార్నే నితిన్‌ ఇటీవల సినీ రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. మ్యాడ్‌ సినిమాతో అరంగేట్రం చేసినా.. గోదావరి ప్రాంత కథాంశంతో 'ఆయ్‌' సినిమాతో హీరోగా నితిన్‌ మంచి విజయాన్ని అందుకున్నాడు. అతడు ఎవరో కాదు ప్రముఖ పారిశ్రామికవేత్త నార్నే శ్రీనివాస రావు కుమారుడు. తాజాగా నితిన్‌ వివాహం చేసుకోబోతున్నాడు. హైదరాబాద్‌లో తనకు కాబోయే భార్య శివానికి నితిన్‌ ఉంగరం తొడిగాడు. ఈ నిశ్చితార్థ వేడుకకు ఎన్టీఆర్‌ కుటుంబ సమేతంగా హాజరయ్యాడు. భార్య లక్ష్మీ ప్రణతి, కుమారులు అభయ్‌, భార్గవ్‌తో సందడి చేశారు.

Also Read: Operation Raavan: ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చేసిన సైకో సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఆపరేషన్ రావణ్’ మూవీ..


ఈ వేడుకలో ఎన్టీఆర్‌ సోదరుడు, హీరో నందమూరి కల్యాణ్‌ రామ్‌, సీనియర్‌ హీరో విక్టరీ వెంకటేశ్ కూడా హాజరయ్యారు. త్వరలోనే నితిన్‌, శివానీల వివాహం కానుందని సమాచారం. ఈ వేడుకలో ఎన్టీఆర్‌తోపాటు భార్య, పిల్లలు గోధుమ రంగు దుస్తుల్లో మెరిశారు. లక్ష్మీ ప్రణతి గాగ్రా, చున్నీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కాబోయే వధూవరులను ఎన్టీఆర్‌ దంపతులు ఆశీర్వదించారు. కొత్త జంటతో ఎన్టీఆర్‌ కుటుంబం దిగిన ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇటీవల దేవరతో భారీ హిట్‌ అందుకున్న ఎన్టీఆర్‌ ఆ తర్వాత ఇప్పుడే బయట కనిపించడంతో తారక్‌ అభిమానులు తమ హీరోను చూసి ఆనందపడ్డారు.


బావ వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన నితిన్‌ హీరోగా నిలదొక్కుకుంటున్నాడు. 'మ్యాడ్‌' సినిమాలో ప్రత్యేక పాత్రలో నితిన్‌ మెరిసిన విషయం తెలిసిందే. అనంతరం 'ఆయ్‌' సినిమాతో కెరీర్‌లో హీరోగా తొలి విజయం అందుకున్నాడు. అతడి మరికొన్ని సినిమాలు ఉన్నాయని సమాచారం. వివాహమయ్యే లోపు ఒక సినిమా పూర్తి చేసి తదనంతరం వివాహం చేసుకుంటాడని టాలీవుడ్‌ టాక్‌. అయితే సినిమాలపరంగా తన బావమరిదికి ఎన్టీఆర్‌ కొన్ని సలహాలు, సూచనలు చేస్తున్నారు. కథకు ప్రాధాన్యం ఇస్తూనే నటనపై కూడా నితిన్‌ దృష్టి సారించాడు. మ్యాడ్‌లో నటన ఆకట్టుకోగా.. ఆయ్‌లో నటుడిగా కొంత మెరుగుపడాలనే ఇండస్ట్రీ పెద్దలు సూచనలు చేశారు. ఏదీ ఏమైనా ఎన్టీఆర్‌ కుటుంబంలో నితిన్‌ వివాహంతో సందడి నెలకొంది.









స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి