Amaran 3 Days WW Box Office Collections: ‘అమరన్’ 3 డేస్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. మొత్తం వసూళ్లు ఇవే..

Amaran 3 Days WW Box Office Collections: శివకార్తికేయన్, సాయి పల్లవి హీరో, హీరోయిన్లుగా నటించిన లేటెస్ట్ మూవీ ‘అమరన్’. దీపావళి కానుకగా విడుదలైన ఈ సినిమా సూపర్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ముఖ్యంగా మూడు రోజుల్లో ఈ సినిమా సాధించిన కలెక్షన్స్ విషయానికొస్తే..    

Written by - TA Kiran Kumar | Last Updated : Nov 3, 2024, 04:27 PM IST
Amaran 3 Days WW Box Office Collections: ‘అమరన్’ 3 డేస్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. మొత్తం వసూళ్లు ఇవే..

Amaran 3 Days WW Box Office Collections: శివకార్తికేయన్ తమిళంలోనే కాకుండా తెలుగులో వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇతని గత సినిమాలు తెలుగులో మంచి విజయాలనే నమోదు చేశాయి. ఈ రూట్లోనే ప్రముఖ ఆర్మీ ఆఫీసర్ ముకుంద్ వరద రాజన్ జీవిత చరిత్ర నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ‘అమరన్’. అంటే అమరుడని అర్ధం. రాజ్ కుమార్ పెరియాసామి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ తో మంచి వసూళ్లను రాబడుతోంది. అంతేకాదు దీపావళి కానుకగా విడుదలైన ఈ సినిమాల్లో ఈ చిత్రం అత్యధిక వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతుంది.

ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ విషయానికొస్తే..

ఈ సినిమా తెలుగులో మొదటి రోజు రూ. 2.81 కోట్ల షేర్ రాబట్టింది. రెండో రోజు..రూ. 2.21 కోట్లు.. మూడో రోజు రూ. 2.02 కోట్ల షేర్ రాబట్టింది. మొత్తంగా మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 7.04 కోట్ల షేర్ (రూ. 12 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. తెలుగులో రూ. 5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 5.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగి.. మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవడం విశేషం. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఏరియా వైజ్ వసూళ్ల విషయానికొస్తే..
తెలంగాణ (నైజాం).. రూ. 3.32 కోట్లు..
సీడెడ్ (రాయలసీమ).. రూ. 1.02 కోట్లు..
ఆంధ్ర ప్రదేశ్.. రూ. 2.70 కోట్లు..
ఆంధ్ర ప్రదేశ్ + తెలంగాణ.. రూ. 7.04 కోట్లు (రూ. 12 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. మొత్తంగా మూడు రోజుల్లో రూ. 1.54 కోట్ల లాభాలను అందుకుంది.

ఈ సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ విషయానికొస్తే..

తమిళనాడు.. రూ. 48.15 కోట్ల గ్రాస్
తెలుగు రాష్ట్రాలు.. రూ. 12 కోట్ల గ్రాస్..
కర్ణాటక.. రూ. 6.10 కోట్ల గ్రాస్..
కేరళ.. రూ. 3.30 కోట్ల గ్రాస్..
రెస్ట్ ఆఫ్ భారత్.. రూ. 1 కోట్ల గ్రాస్..
ఓవర్సీస్.. రూ. 32.60 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా మూడు రోజుల్లో రూ. 10.3.15 కోట్ల గ్రాస్ (రూ. 50.95 కోట్ల షేర్) రాబట్టింది.

ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 66 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 67 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగి ఇంకా.. బాక్సాఫీస్ దగ్గర రూ. 16 కోట్ల షేర్ అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఈ సినిమా జోరు చూస్తుంటే.. ఈ సినిమా మరిన్ని రికార్డులు తిరగరాసేలా ఉంది. మొత్తంగా సూపర్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా ఓవరాల్ గా ఎలాంటి వసూళ్లను సాధిస్తుందో చూడాలి.

ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..

ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News