Devara Day 2 Collections: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన యాక్షన్ డ్రామా దేవర: పార్ట్ 1 సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తోంది. మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ.. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మాత్రం సినిమా కన్నుల విందుగా మారింది. ఈ నేపథ్యంలో సినిమాకి మంచి కలెక్షన్లు కూడా వస్తున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజా సమాచారం ప్రకారం, దేవర సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 140 కోట్లకు పైగా వసూలు చేసి మంచి ఓపెనింగ్స్ నమోదు చేసింది. రెండో రోజూ ఈ సినిమాకు మంచి ఆదరణ లభించగా.. దాదాపు రూ. 80 కోట్లకు పైగా వసూలు చేసింది. శనివారం కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న దేవర రెండురోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్ రూ. 220 కోట్లను దాటేసి రికార్డు సృష్టించింది.


దేవర హిందీ వెర్షన్ రెండో రోజు రూ. 9 కోట్లను వసూలు చేసి, సెకండ్ హైయెస్ట్ కలెక్షన్స్ నమోదు చేసుకున్న సినిమాగా నిలిచింది. హైదరాబాద్‌లో సినిమా అత్యధిక ఆక్యుపెన్సీ నమోదు చేసింది, మొత్తం 80.25 శాతం ఆక్యుపెన్సీ ఉండగా.. నైట్ షోలలో 94 శాతం ఆక్యుపెన్సీ.. ఈవెనింగ్ షోలలో 87 శాతం.. మధ్యాహ్నం 78 శాతం ఆక్యుపెన్సీ వచ్చింది.


జూనియర్ ఎన్టీఆర్ మాస్ పర్ఫామెన్స్ సినిమాకి అతిపెద్ద హైలైట్ అని చెప్పుకోవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లో దేవర కి మంచి స్పందన వస్తోంది కానీ.. ఇతర ప్రాంతాల్లో మాత్రం సినిమాకు అంత మంచి కమర్షియల్ సక్సెస్ దొరికేలా కనిపించడం లేదు. 


ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్ గా కనిపించారు. చైత్ర రాయ్, శృతి మారాఠే, మురళీ శర్మ, కలైయారసన్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. దేవరకు సీక్వెల్ గా దేవర: పార్ట్ 2 కూడా త్వరలో ప్రారంభం కాబోతోంది. అనిరుద్ రవిచందర్ సంగీతం కూడా సినిమాకు చాలా బాగా ప్లస్ అయ్యింది.


Read more: Hydra Victims: నీ అయ్య జాగీరా ఎవడ్రా నువ్వు మా ఇల్లు కూలగొట్టేది.. హైడ్రా వర్సెస్ మూసీ బాధితులు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.