NTR - Devara:జూనియర్ ఎన్టీఆర్.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్' మూవీతో  గ్లోబర్ లెవల్లో పాపులర్ అయ్యాడు. ఈ మూవీలో  కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ యాక్టింగ్‌కు మంచి పేరు వచ్చింది. ఈ మూవీ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' మూవీ చేస్తున్నాడు తారక్. ఈ మూవీ నడివి ఎక్కువ కావడంతో ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేస్తుఉన్నారు. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా చేయాల్సింది. కానీ నీల్ మాత్రం.. ప్రభాస్‌తో 'సలార్ 2'మూవీ కంప్లీటైన తర్వాత ఎన్టీఆర్ సినిమాను స్టార్ట్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన యాక్షన్ పార్ట్ కంప్లీటైనట్టు సమాచారం. రీసెంట్‌గా సైఫ్ అలీ ఖాన్.. గాయం నుంచి కోలుకొని ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా ఈ సినిమాలో టాకీ, పాటల మినహా యాక్షన్ పార్ట్ కంప్లీట్ అయినట్టు సమాచారం. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు, పాటలు మొదలు పెట్టనున్నట్టు సమాచారం. ఈ సినిమాలోని పాటలను మన దేశంలోనే గోవా, లక్షద్వీప్, కొచ్చిల్లో చిత్రీకరించాలనే ప్లాన్‌లో ఉన్నారట.
ఇక దేవర మూవీలో ఎన్టీఆర్ మరోసారి త్రిపుల్ రోల్లో యాక్ట్ చేస్తున్నాడా అంటే ఔననే అంటున్నాయి సినీ వర్గాలు.


ఈ సినిమాలో ఎన్టీఆర్.. తండ్రి ఇద్దరు కుమారులుగా యాక్ట్ చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ విషయమైన క్లారిటీ రావాల్సి ఉంది. ముందుగా ఈ సినిమాను ఏప్రిల్ 5న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక ఈ సినిమాలో విలన్‌గా నటిస్తోన్న సైఫ్ అలీ ఖాన్ గాయం కారణంగా ఈ సినిమా షూటింగ్ డిలే అయింది. దీంతో ఈ చిత్రాన్ని అక్టోబర్ 10న దసరా కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. మరో ఇద్దరు హీరోయిన్స్‌కు ఈ సినిమాలో ఛాన్స్ ఉండే అవకాశాలున్నాయి.


'దేవర'లో ఎన్టీఆర్ త్రిపుల్ రోల్లో యాక్ట్ చేస్తే.. 'జై లవకుశ' తర్వాత ఎన్టీఆర్ త్రిపుల్ రోల్లో నటిస్తోన్న సినిమా దేవర అవుతోంది. ఈ జనరేషన్‌లో ఒక సినిమాలోనే త్రిపుల్ రోల్లో యాక్ట్ చేయడం గ్రేట్ అనుకుంటే రెండు సినిమాల్లో నటించడం అంటే మాములు విషయం కాదు. ఇక ఎన్టీఆర్.. దేవర సినిమాను రెండు పార్టులుగా తెరకెక్కించనున్నాడు. దాంతో పాటు ఏప్రిల్ నుంచి హృతిక్ రోషన్‌లో కలిసి 'వార్ 2' మూవీ షూటింగ్‌లో జాయిన్ కానున్నాడు. ఈ సినిమాపై భారతీయ చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలే ఉన్నాయి. నార్త్, సౌత్ సూపర్ స్టార్స్ కలిసి నటిస్తోన్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాను భారీ ఎత్తున స్పై యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కిస్తోంది. అటు ప్రశాంత్ నీల్ మూవీ కూడా జూలై తర్వాత సెట్స్ పైకి వెళ్లనుంది.


Also Read: Telangana: ముఖ్యమంత్రి అవుతాడని రేవంత్‌ రెడ్డి స్వగ్రామంలోనే ఎవరూ నమ్మలేదు: కేటీఆర్‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి