Police Lathi Charge On NTR Fans: తమ అభిమాన హీరో నటించిన సినిమాకు సంబంధించిన కార్యక్రమం కావడంతో అభిమానులు పోటెత్తారు. ఊహించని రీతిలో అభిమానులు రావడంతో భద్రతా సిబ్బంది వారిని నిలువరించారు. భద్రతా సిబ్బంది ఫెయిలవడంతో ఈవెంట్‌ను రద్దు చేశారు. దీంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ హీరోను ప్రత్యక్షంగా చూడాలనే భావనలో హోటల్‌లో బీభత్సం సృష్టించారు. ఈ సందర్భంగా లగ్జరీ హోటల్‌ అద్దాలు ధ్వంసం చేశారు. ఈ సంఘటన దేవర ప్రీ రిలీజ్‌ వేడుకలో చోటుచేసుకుంది. ఎన్టీఆర్‌ అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించడంతో హోటల్‌కు తీవ్ర నష్టం ఏర్పడింది. ఈవెంట్‌ కోసం వచ్చిన అతిథులు వెనుదిరిగిపోయారు.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Samantha: వైరల్ గా మారుతున్న సమంత టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్.. ఈ మార్క్స్ చూశారా..?


కొరటాల శివ దర్శకత్వంలో మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్‌ జంటగా నటించిన సినిమా 'దేవర'. ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలో ముందస్తు విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లోని నోవాటెల్‌ హోటల్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొద్ది సంఖ్యలో మాత్రమే అభిమానులను ఆహ్వానించారు. అయితే ఊహించని స్థాయిలో అభిమానులు రావడంతో హోటల్‌ వద్ద ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసింది.

Also Read: Megastar Chiranjeevi: గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో చిరంజీవి.. దేశవ్యాప్తంగా ప్రశంసల వెల్లువ..!


వేలాదిగా ఆడిటోరియం లోపలకు వచ్చేందుకు ఎన్టీఆర్‌ అభిమానులు ప్రయత్నించారు. ఈ క్రమంలో నోవాటెల్ హోటల్ లోపల అద్దాలు ధ్వంసమయ్యారు. దాదాపు 20 వేల మందికి పైగా అభిమానులు తరలిరావడంతో భద్రతా సిబ్బంది చేతులెత్తేసింది. అభిమానుల తాకిడిని నియంత్రించడంలో పోలీసులు విఫలమయ్యారు. దీని కారణంగా ఒక్కసారిగా గేట్లు అన్ని తోసుకొని నోవోటెల్ ఆడిటోరియం లోపలికి అభిమానులు తరలివచ్చారు. ఈ క్రమంలో తోపులాట జరగ్గా పలువురికి గాయాలయ్యాయి. ఈ సందర్భంగా పోలీసులు లాఠీచార్జ్‌ చేసినట్లు సమాచారం.


ఇటీవల విడుదలైన దేవర సినిమా ట్రైలర్లు ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెంచాయి. ద్విపాత్రాభినయంతో ఎన్టీఆర్‌, తన అందాలతో జాన్వీ కపూర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటారని ట్రైలర్‌, టీజర్‌తో అర్థమవుతోంది. కొరటాల శివ దర్శకత్వంపై ప్రేక్షకులు పక్కా హిట్‌ అని భావిస్తున్నారు. ఇప్పటికే దేవర సినిమాకు సంబంధించిన టికెట్లు హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఏపీలో సినిమా ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇక తెలంగాణలో కూడా దేవర టికెట్లు పెరిగే అవకాశం ఉంది.







స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.