Jr NTR`s fan suicide attempt: ఆర్ఆర్ఆర్ మూవీ థియేటర్ వద్ద పోస్టర్స్ రచ్చ.. తారక్ అభిమాని సూసైడ్ అటెంప్ట్
Jr NTR`s fan suicide attempt: ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలకు మరో నాలుగు రోజులే మిగిలి ఉంది. మార్చి 25న ఆర్ఆర్ఆర్ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో ఆ చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానుల సందడి కనిపిస్తోంది.
Jr NTR's fan suicide attempt: ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలకు మరో నాలుగు రోజులే మిగిలి ఉంది. మార్చి 25న ఆర్ఆర్ఆర్ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో ఆ చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానుల సందడి కనిపిస్తోంది. ఆర్ఆర్ఆర్ మూవీ ప్రదర్శించే థియేటర్ల ముందు భారీ ఎత్తున పోస్టర్లు ఏర్పాట్లు చేసే పనుల్లో తారక్ అభిమానులు, రామ్ చరణ్ అభిమానులు బిజీ బిజీగా ఉన్నారు.
ఈ క్రమంలోనే ఇవాళ కోదాడలోని శ్రీనివాస థియేటర్ వద్ద తారక్ ఫ్లెక్సీ ఏర్పాటు చేసే విషయంలో తారక్ అభిమానుల మధ్య పరస్పరం ఘర్షణ తలెత్తింది. తమ ఫ్లెక్సీనే ముందుగా కపడేలా ఉండాలంటే.. తమ పోస్టరే ముందు కనిపించాలని ఇరువర్గాలు పోటీపడ్డాయి. ఆ పోటీ కాస్తా ఘర్షణకు దారితీసింది. దీంతో ఎన్టీఆర్ అభిమానుల్లో ఒకరు మరో అడుగు ముందుకేసి ఏకంగా పెట్రోల్ బాటిల్ తీసి మీద పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.
ఎన్టీఆర్ అభిమాని అఘాయిత్యానికి ఒడిగట్టడం చూసిన స్థానికులు, తోటి అభిమానులు అతడిని వారించి అడ్డుకున్నారు. ఎన్టీఆర్ అభిమాని ఆత్మహత్యాయత్నం ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన థియేటర్ వద్దకు చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. అనంతరం ఘర్షణపడి గొడవకు కారణమైన వ్యక్తులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కి తరలించారు. దీంతో ఆర్ఆర్ఆర్ మూవీ (RRR Movie latest updates) ప్రదర్శనకు రెడీ అవుతోన్న శ్రీనివాస థియేటర్ వద్ద కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
Also read : Manchu Manoj: ఆ ఒక్కడు మా అన్నను టార్గెట్ చేశాడు.. మంచు మనోజ్ సంచలన కామెంట్స్..
Also read : NTR on remake: తండ్రి సినిమా రీమేక్‌కు ఓకే చెప్పిన ఎన్టీఆర్.. ఆ డైలాగ్ ఉండాల్సిందేనట!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook