NTR on remake: తండ్రి సినిమా రీమేక్​కు ఓకే చెప్పిన ఎన్టీఆర్​.. ఆ డైలాగ్​ ఉండాల్సిందేనట!

NTR on remake: తన తండ్రి సినిమాలను రీమేక్ చేసేందుకు సిద్ధమని ఎన్టీఆర్​. అయితే ఇందుకు తానకు కొన్ని కండీషన్స్ ఉన్నాయని చెప్పారు. ఇంతకి ఆ సినిమా ఏది? రీమేక్ గురించిన ప్రస్తావన ఎందుకు వచ్చింది? ఆ వివరాలు చూద్దామిప్పుడు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 20, 2022, 08:17 PM IST
  • ఆర్​ఆర్​ఆర్ ప్రమోషన్స్​లో ఎన్టీఆర్​ ఆసక్తికర కామెంట్స్
  • తండ్రి సినిమా రీమేక్​కు గ్రీన్​ సిగ్నల్​
  • కొన్ని కండీషన్స్ పెట్టిన తారక్​
NTR on remake: తండ్రి సినిమా రీమేక్​కు ఓకే చెప్పిన ఎన్టీఆర్​.. ఆ డైలాగ్​ ఉండాల్సిందేనట!

NTR on remake: ఆర్​ఆర్​ఆర్​ ప్రమోషన్స్​లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ చేసిన కామెంట్స్​ మరోసారి హాట్​ టాపిగ్​గా మారాయి. తన తండ్రి నటించిన సినిమాల్లో ఒక మూవీని రీమేక్ చేసేందుకు తాను సిద్ధమని స్పష్టం చేశారు తారక్​. అందుకు అవకాశమొస్తే తాను సిద్ధమేనని వివరించారు.

ఏ సినిమా గురించి చర్చంటే..

ఎన్టీఆర్​, రామ్​ చరణ్​లు హీరోలుగా నటించిన 'ఆర్​ఆర్​ఆర్'​ మూవీ ఈ నెల 25న థియేటర్లలో విడుదల కానుంది. ఇందుకోసం సినిమా ప్రమోషనస్ భారీ స్థాయిలో జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆర్​ఆర్​ఆర్​ సినిమా మ్యూజిక్ డైరెక్టర్​ ఎం ఎం కీరవాణి వ్యాఖ్యాతగా.. ఎన్టీఆర్​, రామ్​ చరణ్​లుతో స్పెషల్​ చిట్​ చాట్ చేశారు.

ఇందులో 'ఆర్​ఆర్​ఆర్​' మూవీ గురించి, పలు ఇతర ఆసక్తికర విషయాల గురించి చర్చించారు. ఓ సందర్భంలో ఎన్టీఆర్​ను ఉద్దేశిస్తూ కీరవాణి.. 'మీ నాన్నగారి సినిమాల్లో సీతయ్య సినిమాను రీమేక్ చేస్తావా' అని అడిగారు.

ఈ ప్రశ్నకు సమాధానంగా తప్పకుండా చేస్తాన్నారు ఎన్టీఆర్. అయితే ఆ సినిమా చేయాలంటే కొన్ని కండీషన్స్​ పెట్టారు. ఆ సినిమాకు కీరవాణి సంగీతమందించాలని కండీషన్​ పెట్టారు. అంతే కాదు.. సీతయ్యలో ఫేమస్​ డైలాగ్​ ('వినపడదు, వినలేదు, వినడు') తప్పకుండా ఉండాలన్నారు.

ఇక సీతయ్య సినిమాలో తనకు నచ్చిన పాట, సీన్ల గురించి చెప్పారు ఎన్టీఆర్. కీరవాణి కూడా ఆ సినిమాకు సంబంధించిన విషయాలను ఎన్టీఆర్​, రామ్​ చరణ్​లతో పంచుకున్నారు. చిరంజీవి, హరికృష్ణల మధ్య చాలా మంచి అనుబంధముండేదని గుర్తు చేసుకున్నారు.

Also read: Rashi Khanna: కావాలనుకున్నది మరొకటి.. అయ్యింది ఒకటి: రాశీ ఖన్నా

Also read: RRR Movie: ఆర్ఆర్ఆర్ యూనిట్ వాడకం మాములుగా లేదుగా.. 'స్టాచ్యు ఆఫ్ యూనిటీ' వద్ద మొదటి సినిమా మనదే!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News