Jr NTR Bills: మాట ఇచ్చి తప్పారని సినీ హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌పై విమర్శలు చేసిన చిన్నారి కౌశిక్‌ తల్లి మళ్లీ యూటర్న్‌ తీసుకున్నారు. అన్న తప్పు అయ్యింది అంటూ ఆమె క్షమాపణలు కోరారు. ఈ సందర్భంగా ఆమె జూనియర్‌ ఎన్టీఆర్‌కు కృతజ్ఞతలు చెప్పారు. తాను తప్పుగా మాట్లాడలేదని స్పష్టం చేశారు. తనను అపార్థం చేసుకున్నారని.. మీ ఆశీస్సుల వలనే తన కుమారుడు బతికాడని చెబుతూ ఆమె ఆనందం పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Dil Raju: సంధ్య థియేటర్‌ బాధిత రేవతి భర్తకు దిల్‌ రాజు బంపర్‌ ఆఫర్‌.. సినిమా ఛాన్స్‌


అసలు ఏం జరిగింది.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కౌశిక్‌ (19) ఎన్టీఆర్‌కు వీరాభిమాని. అతడు కొంతకాలంగా బోన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ఈ విషయం తెలిసిన ఎన్టీఆర్‌ కౌశిక్‌ను ఆదుకుంటామని.. అతడి ఆస్పత్రి ఖర్చులు భరిస్తానని ఎన్టీఆర్‌ హామీ ఇచ్చాడు. అయితే ఎన్టీఆర్‌ మాట ఇచ్చాడు.. కానీ సహాయం చేయలేదనే ఆరోపణలు వచ్చాయి. ఇదే అంశంపై కౌశిక్‌ తల్లి సరస్వతి మీడియా సమావేశం నిర్వహించి జూనియర్‌ ఎన్టీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు.


Also Read: Shyam Benegal: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. దిగ్గజ దర్శకుడు శ్యామ్‌ బెనగల్‌ కన్నుమూత


అయితే జూనియర్‌ ఎన్టీఆర్‌ వెంటనే కౌశిక్‌ చికిత్సకు అయిన ఆస్పత్రి ఖర్చులను చెల్లించాడు. రూ.12 లక్షలు ఎన్టీఆర్‌ చెల్లించడంతో అతడు డిశ్చార్జయ్యాడు. ఈ నేపథ్యంలో మరోసారి కౌశిక్‌ తల్లి సరస్వతి మీడియాతో మాట్లాడారు. నిన్న మాట్లాడిన మాటలకు వివరణ ఇచ్చారు. 'ఎన్టీఆర్‌ సార్‌ మీ గురించి తప్పుగా మాట్లాడలేదు' అని ప్రకటించారు. మీడియా అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇచ్చానని వివరణ ఇచ్చారు. అయితే తమ కుటుంబం మొత్తం ఎన్టీఆర్‌ అభిమానులమేనని తెలిపారు. కౌశిక్‌ ఆస్పత్రి ఖర్చులు చెల్లించిన ఎన్టీఆర్‌కు కృతజ్ఞతలు చెప్పారు.


'ఎన్టీఆర్‌ సార్‌ టీమ్‌ నాకు సోమవారం సాయంత్రం ఫోన్‌ చేసింది. మేం వస్తున్నాం. డిశ్చార్జ్‌ చేయిస్తామని చెప్పారు. కౌశిక్‌ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మిగిలిన రూ.12 లక్షల బిల్లు కట్టి డిశ్చార్జ్‌ చేయించారు. ఇప్పుడు మా అబ్బాయి ఆరోగ్యం కుదుట పడింది. అయితే నేను మాట్లాడిన మాటలతో ఎన్టీఆర్‌ అభిమానులు మనస్తాపం చెంది ఉంటారు. మీ అందరి ఆశీస్సులతోనే కౌశిక్‌ మెరుగయ్యాడు' అని సరస్వతి వెల్లడించారు.


ఎన్టీఆర్‌ వీరాభిమాని అయిన కౌశిక్‌ (19) తాను చనిపోయేలోపు దేవర సినిమా చూడాలని తల్లిదండ్రులకు చెప్పారు. బోన్‌ క్యాన్సర్‌తో బాధపడుతుండగా చికిత్స కోసం రూ.60 లక్షలు ఖర్చు అవుతుందని సరస్వతి దాతల సహాయం కోరారు. దాతల సహాయం, ప్రభుత్వ సహాయంతో కౌశిక్‌ ఆస్పత్రి ఖర్చులు భరించారు. దీంతో మొత్తం రూ.60 లక్షలు సమకూరడంతో కౌశిక్‌ అనారోగ్యం నుంచి కోలుకున్నాడు. ప్రస్తుతం కౌశిక్‌ ఆరోగ్యం మెరుగవడంతో ఎన్టీఆర్‌ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.





స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.