Jr NTR: పవన్ కళ్యాణ్ అభిమానులకు బిగ్ షాక్ ఇచ్చిన ఎన్టీఆర్.. ఇది ఎవరు ఎక్స్ పెక్ట్ చేయనది..
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ అభిమానులకు బిగ్ షాక్ ఇచ్చారు. పవర్ స్టార్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తోన్న డేట్ లో తారక్ కర్ఛీఫ్ వేసేసాడు. అంతేకాదు తన లేటెస్ట్ మూవీని ఆ డేట్ లో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
Jr NTR: ప్రస్తుతం ఏపీ రాజకీయాలతో పాటు దేశ వ్యాప్తంగా అసలు సిసలు పవర్ స్టార్ గా పవన్ కళ్యాణ్ పేరు మారు మోగిపోతుంది. మొన్నటి వరకు జనసేనాని పవన్ కళ్యాణ్.. ఇపుడు మంత్రిగా కొత్త బాధ్యతలు స్వీకరించారు. దీంతో పవన్ చేస్తోన్న సినిమాల పరిస్థితి ఏంటనేది సందిగ్ధంలో పడింది. ఈ యేడాది పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో ‘ఓజి’ మూవీని సెప్టెంబర్ 27న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఎన్నికలు పూర్తైయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఆ సినిమాను పూర్తి చేస్తారని అభిమానులు ఆశించారు. కానీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పెద్ద ప్రభంజనంతో అధికారంలోకి వచ్చింది. అంతేకాదు తాజాగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు క్యాబినేట్ లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు.
ఈ నేపథ్యంలో మంత్రిగా ఆయన మరింత బిజీగా ఉండే అవకాశాలున్నాయి. ఇక పవన్ కూడా ఇప్పటికే షూట్ చేసిన సినిమాల పరిస్థితి ఏంటనే విషయం కూడా డోలాయమానంలో పడింది. అయితే... పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ఓజీ మూవీని ముందుగా సెప్టెంబర్ 27న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. తీరా పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండటం కారణంగా ఈ సినిమా ఈ యేడాది రిలీజ్ అయ్యే పరిస్థితులు కనపడటం లేదు. ఆ డేట్ లో రిలీజ్ కావడం లేదనే విషయం పక్కా అని కన్ఫామ్ కావడంతో ఆ డేట్ లో ఇపుడు ఎన్టీఆర్ దేవర మూవీ సెప్టెంబర్ 27న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
మొత్తంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఎదురు చూసిన డేట్ లో ఎన్టీఆర్ సినిమా రావడంపై పవర్ స్టార్ అభిమానులు ఒకింత నిరాశలో ఉన్నారు. ఏది ఏమైనా ఈ యేడాది పవన్ కళ్యాణ్ నటించిన ‘హరి హర వీరమల్లు’ పార్ట్ 1 రావడం మాత్రం పక్కా అని చెప్పొచ్చు. ఇప్పటికే మొదటి పార్ట్ కు సంబంధించిన పవన్ కళ్యాణ్ షూటింగ్ సహా అన్ని పనులు దాదాపు పూర్తయ్యాయి. పవన్ కళ్యాణ్ రెండు కేటాయిస్తే డబ్బింగ్ పనులు కూడా పూర్తవుతాయి. దీంతో ఈ సినిమాను రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడమే తరువాయి అని చెబుతున్నారు. మరోవైపు అక్టోబర్ 10న బాలయ్య, బాబీ సినిమా రిలీజ్ చేస్తున్నట్టు సమాచారం. అందుకే బాబాయికి పోటీ వద్దనే కారణంతో రెండు వారాలు ముందుగానే వస్తున్నాయి.
దేవర విషయానికొస్తే.. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత ఎన్టీఆర్ యాక్ట్ చేస్తోన్న మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. అంతేకాదు హీరోను ఢీ కొట్టే విలన్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. మొత్తంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఎన్టీఆర్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
Read more: Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..
Read more: Viral video: ఒరేయ్.. ఎవర్రా మీరంతా.. వర్షం బురద నీళ్లను వదలరా.. వైరల్ గా మారిన వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter