Devara Hindi Box Office Collections: రాజమౌళితో సినిమా చేసిన ఏ హీరోకు ఆ తర్వాత సినిమాతో డిజాస్టర్ అందుకుంటారనేది సెంటిమెంట్ గా వస్తోంది. తాజాగా ఎన్టీఆర్.. ఆ సెంటిమెంట్ కు బ్రేకులు వేసాడు. సినిమాలో దమ్ముంటే బాక్సాఫీస్ దగ్గర ఏ సెంటిమెంట్ పనిచేయదనేది తారక్ ప్రూవ్ చేసాడు. గతంలో ఎన్టీఆర్ తండ్రీ కొడుకులుగా  డ్యూయల్ రోల్లో యాక్ట్ చేసిన ఆంధ్రావాలా, శక్తి సినిమాలేవి బాక్సాఫీస్ దగ్గర నడవలేదు. తాజాగా ‘దేవర’ లో కూడా ఫాదర్ అండ్ సన్ రోల్లో నటించి మెప్పించాడు. ఓ రకంగా ‘దేవర’తో తన రెండు బ్యాడ్ సెంటిమెంట్స్ ను బ్రేక్ చేసాడు ఎన్టీఆర్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటించిన ప్యాన్ ఇండియా చిత్రం ‘దేవర’ తో హిందీలో డీసెంట్ వసూళ్లనే రాబడుతుంది. మొత్తంగా అక్కడ రూ. 20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా అక్కడ 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని లాభాల్లోకి వచ్చింది. మొత్తంగా ఆర్ఆర్ఆర్ ప్యాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అయినా.. అందులో రాజమౌళి, రామ్ చరణ్ లతో పాటు అజయ్ దేవ్ గణ్ పాత్ర కూడా ఉంది.


ఇదీ చదవండి: Pawan Kalyan Second Daughter: పవన్ కళ్యాణ్ చిన్న కూతురును చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో..!


ఇదీ చదవండి: Devara Villain Saif: దేవర విలన్ బైరాకు వైయస్ఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా..


ఓ రకంగా ఎన్టీఆర్ కు ఆర్ఆర్ఆర్ తర్వాత ‘దేవర’ బాలీవుడ్ లో లిట్మస్ టెస్ట్ అని చెప్పాలి. ఈ టెస్ట్ లో ఎన్టీఆర్ 100 కు 100 మార్కులతో పాస్ అయ్యాడు. తొలి రోజు డీసెంట్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా ఇప్పటి వరకు ఆరు రోజుల్లో
సాధించిన కలెక్షన్స్  విషయానికొస్తే..


శుక్రవారం.. రూ. 7.95 కోట్లు.. శని వారం.. రూ. 9.50 కోట్లు.. ఆదివారం.. రూ. 12.07 కోట్లు.. సోమవారం.. రూ. 4.40 కోట్లు.. మంగళ వారం.. రూ. 4.80 కోట్లు.. బుధ వారం.. రూ. 7.15 కోట్లు.. మొత్తంగా ఆరు రోజుల్లో రూ. 45.87 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. మొత్తంగా ఈ రోజుతో ఈ సినిమా బాలీవుడ్ లో రూ. 50 కోట్ల నెట్ వసూళ్లను అందుకోవడం పక్కా అని చెప్పొచ్చు. మొత్తంగా సోలో హీరోగా ప్యాన్ ఇండియాలో హిందీలో ‘దేవర’ గట్టెక్కింది. ఇక తమిళనాడులో మాత్రమే ఈ సినిమా కాస్త పుంజుకోవాలి. మొత్తంగా విడుదలైన అన్ని రాష్ట్రాల్లో ఈ సినిమా డీసెంట్ వసూళ్లనే రాబట్టింది. ఏది ఏమైనా హిందీ బెల్ట్ లో మాత్రం సోలో హీరోగా ఎన్టీఆర్ తన స్టామినా ఏంటో ‘దేవర’ మూవీతో  ప్రూవ్ చేసుకున్నాడు. త్వరలో హృతిక్ రోషన్ తో కలిసి ‘వార్ 2’తో డైరెక్ట్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు తారక్. మరోవైపు ప్రశాంత్ నీల్ తో చేస్తోన్న ‘డ్రాగన్’ మూవీతో ఎన్టీఆర్ సత్తా చాటడం పక్కా అని చెబుతున్నారు.


ఇదీ చదవండి:  Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..


ఇదీ చదవండి:  Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..