NTR - Hrithik - War 2: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా  ప్యాన్ ఇండియా లెవల్లో ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న సినిమాల్లో ‘వార్ 2’ మూవీ ఒకటి. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా నిర్మిస్తున్నఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొన్నాడు.ఇప్పటికే ఎన్టీఆర్, హృతిక్ లపై కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ పాటను పిక్చరైజ్ చేసినట్టు సమాచారం. ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు తరహాలో ఈ పాట ఉండబోతుందట. ఇద్దరు మంచి డాన్సర్స్ కావడంతో ఈ పాటపై భారీ అంచనాలే ఉన్నాయి.   తాజాగా ఆగష్టు నుంచి ఈ సినిమా కోసం తారక్.. బల్క్ గా డేట్స్ కేటాయించనున్నాడు. అంతేకాదు నవంబర్ వరకు తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేయనున్నాడట.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతేకాదు ఆగష్టు రెండవ వారం నుంచి ఎన్టీఆర్, హృతిక్ రోషన్ లపై ఇంటర్వెల్ బ్యాంగ్ కు సంబంధించిన షూట్ చేయనున్నారట. ఇందులో సినిమాలోని ప్రధాన తారాగణం మొత్తం పాల్గొనబోతున్నట్టు సమాచారం. మరోవైపు వార్ 2 కంప్లీట్ కాగానే వార్ 3 మూవీకి కూడా ప్లాన్ చేస్తున్నారట మూవీ మేకర్స్. ఇందులో కూడా ఎన్టీఆర్ భాగస్వామి కాబోతున్నట్టు సమాచారం.  అలాగే వచ్చే నెల రెండో వారం నుంచి ‘వార్ 2’ ఇంటర్వెల్ ను షూట్ చేస్తారని తెలుస్తోంది. ఈ ఇంటర్వెల్ సీక్వెన్స్ లో హృతిక్ రోష‌న్‌ – ఎన్టీఆర్ లతో పాటు ఇతర తారాగణం కూడా పాల్గొంటారని టాక్ నడుస్తోంది. మరోవైపు షారుఖ్ ఖాన్.. ‘పఠాన్ 2’, టైగర్ వర్సెస్ పఠాన్ మూవీస్ లో కూడా తారక్ కెమియో రోల్ ప్లే చేయనున్నట్టు సమాచారం. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.


మరోవైపు ఎన్టీఆర్ ఇతర సినిమాల విషయానికొస్తే.. ఈయన కొరటాల శివ దర్శకత్వంలో చేస్తోన్న ‘దేవర పార్ట్ -1’ సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. మరోవైపు దేవర పార్ట్ 2 సమ్మర్ కానుకగా విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ ‘దేవర’లో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ చేసాడు. మరోవైపు ఆగష్టు నుంచి ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ తో చేయబోతున్న ‘డ్రాగన్’ మూవీ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. దాంతో పాటు బాలీవుడ్ లో సంజయ్ లీలా భన్సాలీతో ఓ బిగ్ ప్రాజెక్ట్ చేయనున్నట్టు సమాచారం.


ఇదీ చదవండి: ఆ తరంలో NTR, కృష్ణంరాజు.. ఈ జనరేషన్ లో రాజశేఖర్, ప్రభాస్ లకే ఆ క్రెడిట్ దక్కింది..


ఇదీ చదవండి: ‘కల్కి ’ సినిమాలో నాగ్ అశ్విన్ చేసిన ఈ బ్లండర్ మిస్టేక్ ను గుర్తించారా..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook