NTR - Hrithik Roshan - War 2: ఎన్టీఆర్, హృతిక్ రోషన్ల వార్ 2 షూటింగ్ పై సాలిడ్ అప్డేట్..
NTR - Hrithik - War 2: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సౌత్, నార్త్ తేడా లేకుండా ప్యాన్ ఇండియా లెవల్లో అందరు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న మూవీల్లో `వార్ 2` ఒకటి. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వంటి తెలుగు, హిందీ సూపర్ స్టార్స్ కాంబోలో తెరకెక్కబోతున్న ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ మూవీలో ఇద్దరు సూపర్ స్టార్స్ ఎపుడు షూటింగ్‌లో జాయిన్ అయ్యే డేట్స్ ఫిక్స్ అయినట్టు సమాచారం.
NTR - Hrithik Roshan - War 2: జూనియర్ ఎన్టీఆర్ (నందమూరి తారక రామారావు).. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'ఆర్ఆర్ఆర్' మూవీతో ప్యాన్ ఇండియా (భారత్) స్టార్‌గా తన సత్తా ఏంటో చూపించాడు. ఈ సినిమాలో కొమరం భీమ్ పాత్రలో జూనియర్ నటనను ఎవరు మరిచిపోలేదు. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' మూవీ చేస్తున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమా అక్టోబర్ 10న ఈ సినిమా విడుదల కానుంది. ఈ మూవీ రెండు భాగాలుగా రాబోతుంది. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా చేయాల్సింది. కానీ నీల్ మాత్రం.. ప్రభాస్‌తో 'సలార్ 2'మూవీ కంప్లీటైన తర్వాత ఎన్టీఆర్ సినిమాను స్టార్ట్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడు.
మరోవైపు ఎన్టీఆర్ కూడా దేవర మూవీ తర్వాత వెంటనే వార్ 2 స్టార్ట్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడు. దాంతో పాటు దేవర 2 సినిమా షూటింగ్‌ను ఒకేసారి చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడు. ఇప్పటికే సైఫ్ అలీ ఖాన్ గాయం కారణంగా దేవర మూవీ షూటింగ్ ఆలస్యం కానుంది. మరోవైపు హృతిక్ రోషన్.. కూడా గాయలపాలై ఇపుడిపుడే కోలుకుంటున్నాడు. తాజాగా హృతిక్.. వార్ 2 షూటింగ్‌లో మార్చి 7న జపాన్ ఉన్న షావోలిన్ టెంపుల్ దగ్గర హృతిక్ ఇంట్రో సీన్స్‌తో ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ కానున్నాడు. ఎన్టీఆర్ ఈ నెల 20తో దేవర ఫస్ట్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేయనున్నాడు. ఆ తర్వాత వారం రోజులు రెస్ట్ తీసుకొని ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ కానున్నాడు. ఆ తర్వాత రెండు షెడ్యూల్స్‌లో ఈ సినిమాను ఎన్టీఆర్ కంప్లీట్ చేయనున్నాడు. యశ్ రాజ్ ఫిల్మ్స్ ఈ సినిమాను భారీ ఎత్తున స్పై యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కిస్తోంది.
ఈ సినిమాలో హీరోయిన్‌గా ముందుగా కియారా పేరు వినిపించింది. తాజాగా ఈ సినిమాలో ఆలియా భట్ కథానాయికగా నటించడం దాదాపు కన్ఫామ్ అయిందని చెబుతున్నారు. దీనిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. ఈమె హృతిక్ సరసన నటిస్తుందా.. ? లేకపోతే ఎన్టీఆర్‌కు జోడిగా యాక్ట్ చేస్తుందా అనేది చూడాలి. లేకపోతే ఆలియా, కియారా ఇద్దరు యాక్ట్ చేస్తారా అనేది చూడాలి.
మొత్తంగా ఎన్టీఆర్.. ఎలాంటి ఈగోలకు పోకుండా తన తోటి స్టార్ హీరోలతో మల్టీస్టారర్ మూవీస్ చేయడానికి ముందుకు రావడం శుభ పరిణామం. దీంతో పాటు మరో హిందీలో తెరకెక్కనున్న భారీ ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్ భాగం కాబోతున్నట్టు సమాచారం. మరోవైపు అట్లీతో ఓ సినిమా ఉండనే ఉంది. దాంతో పాటు కల్కి ఫేమ్ నాగ్ అశ్విన్‌లతో కూడా ఎన్టీఆర్ చర్చలు జరుపుతున్నాడు. త్వరలో వీళ్లిద్దరితో చేయబోయే సినిమాలను అఫీషియల్‌గా ప్రకటించే అవకాశం ఉంది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వెలుబడాల్సి ఉంది. అటు హృతికో రోషన్.. రీసెంట్‌గా 'ఫైటర్' మూవీతో పలకరించారు.
Also read: Tax Free Incomes: ఈ 5 రకాల ఆదాయాలపై ట్యాక్స్ ఉండదని మీకు తెలుసా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook