Jr NTR for Kannada Rajyothsava : బెంగళూరులో దిగిన ఎన్టీఆర్.. యంగ్ టైగర్‌కు స్వాగతం పలికిన కర్ణాటక మంత్రి
Jr NTR Landed At Bangalore యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా బెంగళూరులో ల్యాండ్ అయ్యాడు. ఈ క్రమంలో ఎన్టీఆర్‌కు కన్నడ మంత్రులు ఘనంగా స్వాగతం పలికారు.
Jr NTR for Kannada Rajyothsava : కన్నడ రాజ్యోత్సవ వేడుకలను ఎన్టీఆర్‌ను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. స్వర్గీయ పునీత్ రాజ్‌కుమార్‌కు కర్ణాటక రత్న అవార్డును ప్రభుత్వం ప్రకటించబోతోంది. ఈ ఈవెంట్‌కు రావాల్సిందిగా తలైవా సూపర్ స్టార్ రజినీకాంత్, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు కన్నడ ప్రభుత్వం ఆహ్వానం ప్రకటించింది. అయితే ఇప్పుడు ఈ ఈవెంట్ కోసం ఎన్టీఆర్ బెంగళూరుకు వెళ్లాడు. బెంగళూరులో దిగిన ఎన్టీఆర్‌ను కర్ణాటక రాష్ట్ర మంత్రులు స్వాగతించారు.
ఈ క్రమంలో పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు ఎన్టీఆర్‌కు ప్రత్యేకంగా థాంక్స్ చెప్పారు. ఎన్టీఆర్‌కు ఈ ఆహ్వానం ఇచ్చేందుకు రాఘవేంద్ర రాజ్ కుమార్ కుమారుడు యువరాజ్ ప్రత్యేకంగా హైద్రాబాద్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కర్ణాటక రత్న అవార్డును నేటి సాయంత్రం నాలుగు గంటలకు ప్రధానం చేశారు. విధాన సౌధలో జరిగే ఈ కార్యక్రమంలోనే కర్ణాటక రత్న అవార్డును అందించనున్నారు. ఈ అవార్డులో బంగారం, వెండి కలిపి యాభై గ్రాముల వరకు ఉంటుంది.
కర్ణాటక రత్న అవార్డును అందుకున్న నటుల్లో తొమ్మిదే వ్యక్తిగా పునీత్ రాజ్‌కుమార్ నిలుస్తారు. ఇక అత్యంత పిన్న వయసులో అవార్డు అందుకున్న వ్యక్తిగా తొలిస్థానంలో పునీల్ నిలిచారు. పునీత్ రాజ్ కుమార్ గత ఏడాది మరణించిన సమయంలో కన్నడ రాష్ట్రం మొత్తం శోక సంధ్రంలో మునిగిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా పునీత్ చేసిన మంచి పనులు ఒక్కసారిగా అందరి నోళ్లలో మెదిలాయి. ఎంత మంది విద్యార్థులను చదివిస్తున్నాడు.. ఎంత మందికి ఆశ్రమాన్ని కల్పించాడు.. ఇంకెన్ని గుప్త దానాలు చేశాడో తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు.
ప్రస్తుతం పునీత్ నటించిన చివరి సినిమా గంధడగుడి అందరినీ ఆకట్టుకుంది. కన్నడలో రిలీజ్ చేసిన ఈ చిత్రం అందరినీ గుండె బరువెక్కేలా చేసేసింది. అప్పుకి ఇదే సరైన నివాళి అంటూ అందరూ థియేటర్లోనే ఏడ్చేశారు. ఆ విజువల్స్ సైతం నెట్టింట్లో వైరల్ అయ్యాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook