Devara: దేవరా నుంచి జూనియర్ ఎన్టీఆర్ వీడియో లీక్.. పండగ చేసుకుంటున్న అభిమానులు
Devara Leaked Video: జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు దేవరా సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రం తరువాత జూనియర్ ఎన్టీఆర్ నుంచి రాబోతున్న సినిమా కావటంతో ఈ చిత్రం తప్పకుండా బ్లాక్ బస్టర్ సాధిస్తుంది అనే నమ్మకంతో ఉన్నారు. ఈ క్రమంలో ఈ సినిమా నుంచి లీకైన చిన్న క్లిప్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటుంది.
NTR Leaked Clip from Devara:
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా.. సముద్రం బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టేజియస్ చిత్రం దేవర. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత జూనియర్ ఎన్టీఆర్ నుంచి రాబోతున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ఈ సంవత్సరం చివరిలో విడుదల కానుంది. అయితే ఈ మధ్య మన తెలుగు ఇండస్ట్రీలో సినిమా సెట్స్ నుంచి సినిమాకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు లీక్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాము. అయితే దేవరా చిత్రం నుంచి ఎటువంటి లీకులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు సినిమా యూనిట్. అయినప్పటికీ ఏదో ఒక రూపంలో ఈ మూవీ నుంచి లీక్స్ బయటకి వస్తూనే ఉన్నాయి. రీసెంట్ గా గోవా సముద్రం దగ్గర మూవీ షూటింగ్ సెట్స్ నుంచి అలల మధ్య నడుస్తూ వస్తున్న ఎన్టీఆర్ క్లిప్పింగ్ లీక్ అయ్యి సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
ఈ చిత్రం మొత్తం రెండు భాగాలుగా విడుదలవుతుంది. వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఓ విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. దేవర మూవీ మొదటి భాగం కాగా 20న ఎన్టీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని మూవీకి సంబంధించి ఓ భారీ అప్డేట్ ని అభిమానులు ఆశిస్తుండగా.. ఫిలింనగర్ సమాచారం ప్రకారం ఆ రోజు దేవర మూవీకి సంబంధించి ఓ సాంగ్ ను విడుదల చేయాలి అని మేకర్స్ ఆలోచిస్తున్నారట.
ఇక ఆ విషయం పక్కన పెడితే లీకైన దేవర వీడియో మాత్రం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.ఇలా అయ్యిందో లేదో.. అలా సోషల్ మీడియాలో ఈ క్లిప్పింగ్ తెగ వైరల్ అయిపోయింది. ఈ వీడియో చూసి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం సంబరాలు జరుపుకుంటున్నారు. తమ హీరో అలా పవర్ ఫుల్ గా నడిచి వస్తున్న ఆ చిన్న క్లిప్ చాలు.. దేవరా సినిమా ఎంత పవర్ ఫుల్ గా ఉండబోతుందో అంటూ కామెంట్లు పెడుతున్నారు.
కాగా చిత్ర బృందం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. షూటింగ్ జరుగుతోంది సముద్ర ప్రాంతం కావడంతో.. ఎక్కడో ఒక దగ్గర నుంచి విజువల్స్ ని క్యాప్చర్ చేసి ఆన్లైన్లో వదులుతున్నారు కొంతమంది. గోవాలో జరుగుతున్న ఈ షూటింగ్ షెడ్యూల్ లో జాన్వీతో సాంగ్ తో పాటు కొన్ని యాక్షన్స్ అందివేశాల చిత్రీకరణ జరుగుతోందని టాక్. ఈ మూవీలో యాక్షన్స్ సన్నివేశాలు తారక్ అభిమానులకు ఓ మంచి ట్రీట్ అని తెలుస్తోంది.
ఇక వైరల్ అవుతున్న వీడియో క్లిప్పింగ్ చాలా దూరం నుంచి తీసింది అన్న విషయం అర్థం అవుతోంది. ఇందులో తారక్ స్పష్టంగా కనిపించకపోయినప్పటికీ ఆ వేషధారణ, నడిచే విధానం.. ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. సముద్ర తీర ప్రాంతంలో ఎక్కడో దూరంగా ఉన్న ప్రదేశం నుంచి జూమ్ చేసి ఈ వీడియోని తీశారు అన్న విషయం వీడియో చూస్తే క్లియర్ గా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియోని సోషల్ మీడియాలో తెగ షేర్ చేసి వైరల్ చేస్తున్నారు. ఇక దీనిపై దేవర యూనిట్ ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
Also Read: Arvind Kejriwal: మద్యం కుంభకోణంలో అనూహ్య మలుపు.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్
Also Read: Kavitha Arrest: కవిత అరెస్ట్ వెనకాల ఉన్న కథ ఇదే.. ఢిల్లీ కుంభకోణం అంటే ఏమిటి?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter