Jr NTR New Car: మొన్న జూనియర్‌ ఎన్టీఆర్‌ కొత్త కారు కొనుగోలు చేయగా.. తాజాగా జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా కొత్త కారు కొనుగోలు చేశాడు. తన కొత్త కారు రిజిస్ట్రేషన్ కోసం ఎన్టీఆర్‌ రవాణా శాఖ కార్యాలయానికి చేరుకున్నారు. వాహన రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చిన ఎన్టీఆర్‌కు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుని దగ్గరుండి ప్రక్రియను పూర్తి చేయించారు. ఎన్టీఆర్‌ కొత్తగా కొనుగోలు చేసిన కారు పేరు మెస్సిడెజ్‌ బెంజ్‌ మేబ్యాచ్‌ ఎస్‌ రకం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Allu Arjun: అల్లు అర్జున్‌ కొత్త కారు.. అంతర్జాతీయ డ్రైవింగ్‌ లైసెన్స్‌కు ...


బహిరంగ మార్కెట్‌లో ఈ కారు ధర రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు ఉంటుంది. నలుపు రంగు కారు అందంగా ఉంది. రిజిస్ట్రేషన్‌ చేసుకున్న కారులో వచ్చిన ఎన్టీఆర్‌ కారు రంగు దుస్తులు ధరించాడు. నల్లటి టీ షర్ట్‌ వేసుకుని ఎన్టీఆర్‌ వచ్చారు. నలుపు రంగు కళ్లజోడు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ 'దేవర' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌, బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ నటిస్తున్నారు.

దేవర సినిమాకు సంబంధించి ఇటీవల గోవాలో షూటింగ్ షెడ్యూల్‌‌ పూర్తయ్యింది. కొన్ని సీన్లు మినహా షూటింగ్‌ పూర్తయిందని తెలుస్తోంది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు మొదలయ్యాయని సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి టీజర్‌ వదిలిన విషయం తెలిసిందే. త్వరలోనే టీజర్‌ వదిలి సెప్టెంబర్‌లో సినిమా విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది.

Also Read: Vijay Deverakonda: ప్రేమ పెళ్లి చేసుకుంటా.. నాకు తండ్రిని కావాలని ఉంది: విజయ్‌ దేవరకొండ కీలక వ్యాఖ్యలు


యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ బాలీవుడ్‌లో కూడా ప్రవేశిస్తున్నాడు. యశ్ రాజ్‌ ఫిల్మ్స్‌ బ్యానర్‌లో 'వార్‌ 2' సినిమా చేస్తున్నాడు. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కే ఆ సినిమాలో హృతిక్‌ రోషన్‌ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు ఎన్టీఆర్‌ 50 రోజుల సమయం కేటాయించారని తెలుస్తోంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook