Allu Arjun Licence: కార్లు అంటే యమ ఇష్టపడే సినీ నటుడు అల్లు అర్జున్ తన గ్యారేజ్‌లోకి మరో కొత్త కారును చేర్చాడు. కొనుగోలు చేసిన కొత్త కారుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను బన్నీ పూర్తి చేశాడు. దీనికోసం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో ఉన్న రవాణా శాఖ కార్యాలయానికి స్వయంగా అల్లు అర్జున్ హాజరయ్యాడు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా పత్రాలపై సంతకాలు చేశాడు. దీంతోపాటు అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ కోసం బన్నీ దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.
Also Read: Teaser Dialogues: పవన్‌కు ఎన్నికల సంఘం షాక్.. టీజర్‌లో 'గాజు గ్లాస్' డైలాగ్స్‌పై ఈసీ స్పందన ఇదే!
ఖైరతాబాద్‌లోని ఆర్టీవో కార్యాలయానికి వచ్చిన అల్లు అర్జున్‌కు అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హీరోకు సంబంధించిన ప్రక్రియను వెంటనే పూర్తయ్యేలా అధికారులు దగ్గరుండి పనులు చేశారు. అయితే అల్లు అర్జున్ కొత్త రేంజ్ రోవర్ కారును తనపై రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వచ్చారని సమాచారం. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం మార్చిన కొత్త 'టీజీ' సిరీస్ నంబర్ అల్లు అర్జున్‌కు కేటాయించారు. రేంజ్ రోవర్ కారుకు 'టీజీ09 ౦666' నంబర్ కేటాయించినట్లు సమాచారం. దీంతోపాటు అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్‌కు కూడా దరఖాస్తు చేసుకున్నారని తెలుస్తోంది. కార్యాలయానికి వచ్చిన హీరోతో ఫొటోలు దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా అధికారులు అల్లు అర్జున్‌తో ఫొటోలు దిగారు.
Also Read: Kakinada: 'వారాహి' ఇచ్చిన వ్యక్తికి జనసేన టికెట్.. తంగెళ్ల ఉదయ్‌కు పవన్ రిటర్న్ గిఫ్ట్
పుష్ప సంచలన విజయంతో అల్లు అర్జున్ దానికి సీక్వెల్ 'పుష్ప 2' తీస్తున్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సగం షూటింగ్ పూర్తయ్యిందని టాక్. కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ మిగిలి ఉందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆ సన్నివేశాలు విదేశాల్లో చిత్రించనున్నారని దీనికోసం అల్లు అర్జున్ ప్రత్యేకంగా 'అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్' తీసుకుంటున్నట్లు తెలిసింది. పుష్ప 2 కోసమే ఈ లైసెన్స్ తీసుకుంటున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన విడుదల చేసేందుకు చిత్రబృందం సిద్ధమైంది. కాగా ఈ చిత్రం తర్వాత తమిళ దర్శకుడు అట్లీతో అల్లు అర్జున్ సినిమా చేయబోతున్నాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter