Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీ వారసుడిగా అడుగు పెట్టి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అన్ని ఫ్యామిలీస్ ఏదో ఒక చిన్న చిన్న ప్రాబ్లెమ్స్  ఉంటాయి. అలాగే నందమూరి కుటుంబంలో కూడా ఉన్నాయి. ఆ సంగతి పక్కన పెడితే.. ప్రస్తుతం ఎన్టీఆర్ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి పెద్ద దిక్కులా మారాలనుకుంటున్నారా.. అంటే తారక్ చేసే పనులు చూస్తుంటే ఔననే అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇప్పటికే తెలుగు సినీ ఇండస్ట్రీ పెద్దలుగా ఓ వైపు చిరంజీవి.. మరోవైపు బాలకృష్ణ పెద్దరికం చేస్తున్నారు. అటు సినిమా పరంగానే గాక పొలిటికల్ గా  పవన్ కళ్యాణ్ మరో శక్తిగా ఎదిగారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ క్రమంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో తనదైన గుర్తింపు తెచ్చుకునే పనిలో పడ్డాడు ఎన్టీఆర్. రీసెంట్ గా తెలుగు రాష్ట్రాల్లో వరదల నేపథ్యంలో ముందుగా కొంత మంది స్పందించినా.. పెద్ద స్టార్ హీరోల్లో ముందుగా రెస్పాండ్ అయింది ఎన్టీఆర్ మాత్రమే. తారక్ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు చెరో రూ. 50 లక్షలు విరాళం ప్రకటించి సంచలనం రేపారు. ఆ తర్వాత పోలో మంటూ మిగతా  హీరోలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తమ వంతు చేయూత అందించారు. మొత్తంగా తన విరాళంలో మొత్తం తారాలోకం కదిలొచ్చేలా చేయడంలో ఎన్టీఆర్ సక్సెస్ అయ్యాడు.


తాజాగా సమంత విషయంలో కూడా తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి అక్కినేని ఫ్యామిలీ తర్వాత ముందుగా వాళ్ల కుటుంబంతో పాటు సామ్ కు అండగా నిలబడింది కూడా ఎన్టీఆర్. మొత్తంగా తారక్ ట్వీట్ తో తెలుగు సినీ ఇండస్ట్రీలో కదలిక వచ్చింది. మొత్తంగా ఎపుడు ఏ విషయంలో అంతగా స్పందించని తారాలోకం ఒక్కొక్కురుగా ముందుకు వచ్చి తెలంగాణ బూతుల మంత్రి కొండా సురేఖ తీరును తూర్పారా బట్టారు. అటు రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి అయ్యాకా కూడా పలు సందర్బాల్లో కొంత మంది నేతలపై అనరాని పరుష పదజాలం వాడుతూ ప్రజల్లో తన స్థాయిని తగ్గించుకున్నారు. ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా అనే చందంగా మొత్తంగా రేవంత్ తో పాటు ఆయన మంత్రి వర్గంలో కొండా సురేఖ తన స్థాయికి తగ్గించుకొని ప్రజల్లో పలుచన అయ్యారు. ఒకవైపు హైడ్రాతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూట గట్టుకున్న రేవంత్ సర్కారుకు ఇపుడు కొండా సురేఖ ఇష్యూతో ఏం చేయాలో పాలు పోవడం లేదు. మరోవైపు ఎన్టీఆర్ తో మొత్తం సినీ ఇండస్ట్రీ నాగార్జున అక్కినేని ఫ్యామిలీతో పాటు సమంతకు అండగా నిలవడం సినీ ఇండస్ట్రీ ఈ విషయంలో ఎంత స్ట్రాంగ్ గా నిలబడిందో అర్థమవుతోంది. అటు నాగార్జున కూడా ఎక్కడా తగ్గకుండా.. కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసారు.


ఇదీ చదవండి: Devara Villain Saif: దేవర విలన్ బైరాకు వైయస్ఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా..


ఇదీ చదవండి: Pawan Kalyan Second Daughter: పవన్ కళ్యాణ్ చిన్న కూతురును చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో..!


మొత్తంగా అప్పట్లో  వరద సాయంలోను  ఎన్టీఆర్ ముందున్నాడు.. ఇపుడు సమంత, అక్కినేని ఫ్యామిలీ  ఇష్యూలో కూడా నాన్ అక్కినేని ఫ్యామిలీ హీరోగా రియాక్ట్ అయింది కూడా అతనే.. మిగతా వాళ్లు ట్వీట్ చేయకపోతే.. ఏమైవుతందో అని మొక్కుబడిగా ట్వీట్ చేసినట్టుగా అందురూ పోలీమంటూ ట్వీట్లతో హోరెత్తించారు. మొత్తంగా తన ఒక్క ట్వీట్ తో మొత్తం టాలీవుడ్ ను కదలించాడు. ఏది ఏమైనా బాలయ్య,  పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పొలిటికల్ గా యాక్టివ్ అయిన నేపథ్యంలో ఇపుడు ఎన్టీఆర్ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ బాధ్యతను తను భుజానా తీసుకున్నాడా అనే డౌట్స్ అందరిలో మెదలుతున్నాయి.


ఇదీ చదవండి:  Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..


ఇదీ చదవండి:  Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.