KA Movie 2nd Day Box Office Collections: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం యాక్ట్ చేసిన లేటెస్ట్  మూవీ "క". భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ వసూల్లతో దూసుకుపోతుంది. ప్రేక్షకుల నుంచి "క" సినిమా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. అంతేకాదు డే బై డే ఈ చిత్రానికి  కలెక్షన్స్ పెరుగుతున్నాయి.  ‘క’ సినిమా 2 రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర రూ .13.11 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ (రూ. 7 కోట్ల షేర్) సాధించినట్టు మేకర్స్ ప్రకటించారు. అంతేకాదు విడుదలైన 2 రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. ఇక  3వ రోజు  బాక్సాఫీస్ దగ్గర బుకింగ్స్ బాగున్నాయి.  ఈ ట్రెండ్ చూస్తుంటే "క" ఫస్ట్ వీక్ భారీ వసూళ్లను సాధించిబోతున్నట్టు కనిపిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగులో గతంలో రానటువంటి థ్రిల్లర్ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కింది. క్లైమాక్స్ ఊహించని విధంగా ఉందనే ప్రేక్షకులు చెబుతున్నారు.   కిరణ్ అబ్బవరం తన కెరీర్ లో మంచి నటనతో ఆకట్టుకున్నాడు. ప్రేక్షకులు కూడా కిరణ్ అబ్బవరం యాక్టింగ్ కు ఫిదా అవుతున్నారు.   రాధగా తన్వీరామ్, సత్యభామగా నయన్ సారిక యాక్టింగ్ కూడా ప్రశంసలు కురిస్తున్నాయి.


ఆడియన్స్ ను ఎంగేజ్ చేసే సర్ ప్రైజ్ చేసే ట్విస్టులతో దర్శకులు సుజీత్, సందీప్  ద్వయ ఈ సినిమాను తెరకెక్కించారు. అంతేకాదు తొలి చిత్రంతోనే టాలీవుడ్ లో పాగా వేసారు. వీరిద్దరితో సినిమాలు చేయడానికి యంగ్ టాప్ హీరోలు క్యూ కడుతున్నారు. మొత్తంగా కిరణ్ అబ్బవరం ‘క’ మూవీతో  ఘన విజయాన్ని అందుకున్నారు. "క" సినిమాను శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మించారు.  భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి రిలీజ్ చేశారు.


నటీనటులు - కిరణ్ అబ్బవరం, నయన్ సారిక, తన్వీ రామ్, అచ్యుత్ కుమార్, రెడిన్ కింగ్స్ లే, బలగం జయరాం తదితరులు నటించారు.


ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..


ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter